తెలంగాణ

telangana

ETV Bharat / sports

2023 ప్రపంచకప్​లో ఇంగ్లాండ్ కెప్టెన్​గా బట్లర్​! - జోస్ బట్లర్

2023 ప్రపంచకప్​ నాటికి ఇంగ్లాండ్​ జట్టు సారథిగా జోస్ బట్లర్ వ్యవహరిస్తాడని ఆ దేశ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ అభిప్రాయపడ్డాడు. బట్లర్​ ఇంగ్లాండ్​ జట్టుకు ప్రస్తుతం వైస్ కెప్టెన్​గా ఉన్నాడు. ​

Michael Vaughan predicts England's captain for 2023 World Cup
2023 ప్రపంచకప్​లో ఇంగ్లాండ్ కెప్టెన్​ బట్లర్​!

By

Published : Mar 27, 2021, 5:30 AM IST

2023 ప్రపంచకప్ నాటికి ప్రస్తుత వైస్​ కెప్టెన్​ జోస్​ బట్లర్​.. ఇంగ్లాండ్ జట్టు పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని జోస్యం చెప్పాడు మాజీ క్రికెటర్​ మైకేల్ వాన్. ప్రస్తుతం సారథిగా వ్యవహరిస్తున్న ఇయాన్ మోర్గాన్.. గౌరవనీయులైన ఇంగ్లీష్​ క్రికెటర్లలో ఒకడని పేర్కొన్నాడు. 2019 వరల్డ్​కప్ అందించిన నాటి నుంచి ఫామ్​లేమితో సతమతమవుతున్న మోర్గాన్​.. వచ్చే వన్డే ప్రపంచ​కప్​ నాటికి అందుబాటులో ఉండేది అనుమానమేనని అభిప్రాయపడ్డాడు.

2021, 2022 టీ20 ప్రపంచకప్​లకు మోర్గాన్​ నాయకత్వం వహించే అవకాశం ఉంది. ఆ తర్వాత భారత్​ వేదికగా జరగనున్న 2023 వన్డే వరల్డ్​కప్​లో మాత్రం అతడు ఆటగాడిగా ఉన్నప్పటికీ.. కెప్టెన్సీ మాత్రం బట్లర్​కు అప్పగించొచ్చు. అని వాన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

టీమ్​ఇండియాతో జరుగుతున్న ప్రస్తుత సిరీస్​లోనూ మోర్గాన్ విఫలమయ్యాడు. మిడిలార్డర్​లో బ్యాటింగ్​కు దిగుతున్న ఇయాన్​.. టీ20ల్లోనూ పెద్దగా రాణించలేదు. గాయం కారణంగా రెండో వన్డేకు దూరమైన అతడి స్థానంలో బట్లర్ పగ్గాలు చేపట్టాడు.

ఇదీ చదవండి:స్టోక్స్, బెయిర్ స్టో​ విధ్వంసం.. ఇంగ్లాండ్​దే రెండో వన్డే

ABOUT THE AUTHOR

...view details