బాల్ టాంపరింగ్‌ను అధికారికం చేయాలన్న ఆలోచనల్లో అర్థం లేదని వెస్టిండీస్ మాజీ పేసర్ మైకేల్ హోల్డింగ్ అన్నాడు.
"కరోనా నేపథ్యంలో క్రికెటర్లు ఇకపై బంతికి ఉమ్మును రాయకుండా ఇతర మార్గాల ద్వారా మెరుపు తెప్పించడానికి అనుమతించే ఆలోచనలో ఉందని విన్నా. అంపైర్ సమక్షంలో జరిగే బాల్ టాంపరింగ్ ఇది. ఇలా చేయడంలో అర్థమే లేదు. సురక్షిత వాతావరణంలోనే మళ్లీ క్రికెట్ మొదలవ్వాలి. క్రికెట్ కలిసి ఆడే ఆట. ఒకే హోటల్‌లో ఉండాలి.. ఒకే చోట తినాలి.. మరి ఎందుకు ప్రత్యేకంగా ఉమ్ము గురించి చర్చ. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఆడడం ఎందుకు."