తెలంగాణ

telangana

ETV Bharat / sports

'కెప్టెన్​గా స్మిత్ సరైన వ్యక్తి కాదు' - Michael clark says steve smith is not the right person for captain

ఆస్ట్రేలియా క్రికెటర్​ స్టీవ్​ స్మిత్​కు మళ్లీ జట్టు పగ్గాలు అప్పగించాలంటూ వస్తున్న వ్యాఖ్యలపై స్పందించాడు మాజీ కెప్టెన్​ మైకేల్​ క్లార్క్​. స్టీవ్..​ కెప్టెన్సీకి అర్హుడు కాదని అన్నాడు.

australia
'స్టీవ్​ స్మిత్​ కెప్టెన్సీకి అర్హుడు కాదు'

By

Published : Mar 4, 2020, 7:02 AM IST

ఆస్ట్రేలియా సారథిగా స్టీవ్ స్మిత్‌ సరైన వ్యక్తి కాదంటూ ఆ జట్టు మాజీ కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్టార్ పేసర్ పాట్ కమిన్స్‌ను మూడు ఫార్మాట్లలో ఆసీస్ కెప్టెన్‌గా నియమిస్తే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇటీవల మీడియా సమావేశంలో క్లార్క్‌ పాల్గొనగా.. ఆసీస్ కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్‌ను మళ్లీ నియమించాలంటారా? అని ఒక విలేకరి ప్రశ్నించగా.. "ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఆస్ట్రేలియాకు ఇంతమంది కెప్టెన్లు అవసరం లేదు. ఒక్కో ఫార్మాట్‌కు తలో కెప్టెన్‌ ఉండడం కన్నా.. మూడు ఫార్మాట్లకూ కలిపి ఒకే సారథి ఉండటం మంచిది" అని అన్నాడు. టీ20 ప్రపంచకప్ తర్వాత కమిన్స్‌ను మూడు ఫార్మాట్లలో ఆ బాధ్యతను అప్పగిస్తే బాగుంటుందని సూచించాడు.

"పాట్‌ కమిన్స్‌.. ఆటను బాగా అర్థం చేసుకుంటాడు. అతను ఓపెనింగ్ బౌలర్ మాత్రమే కాకుండా బ్యాటింగ్ చేయగలడు. మైదానంలోనూ చాలా చురుకుగా ఉంటాడు. అతడిని మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా నియమిస్తే మంచిదని నా అభిప్రాయం. ఇప్పటి పరిస్థితుల్లో ఆసీస్ జట్టుకు ఉత్తమ సారథి అవసరం. స్టీవ్ స్మిత్ ఉత్తమ బ్యాట్స్‌మన్‌.. అది నేనూ ఒప్పుకుంటా.. కానీ కెప్టెన్సీ అందుకోవడానికి సరైన వ్యక్తి మాత్రం కాదనుకుంటున్నా. టిమ్​పైన్ ఇప్పటికే కెప్టెన్‌గా అద్భుతంగా రాణించాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. పైన్ వీడ్కోలు చెప్పేవరకు ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా కొనసాగే హక్కు అతడికి ఉంది. టిమ్​కు ఇప్పుడు 35 ఏళ్లు. ఈ వేసవి తర్వాత అతడు వీడ్కోలు గురించి ఆలోచిస్తాడని అనుకుంటున్నా. స్వదేశీ సిరీస్‌లో టీమిండియాపై ఆస్ట్రేలియా గెలిస్తే ​పైన్ వీడ్కోలు పలకడానికి అదే సరైన సమయం"

-మైకేల్‌ క్లార్క్‌, మాజీ కెప్టెన్

బాల్ టాంపరింగ్ వివాదం కారణంగా స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు ఏడాది నిషేధం ఎదుర్కొన్నారు. స్మిత్ తన కెప్టెన్సీ కోల్పోయాడు. ఫలితంగా పరిమిత ఓవర్లకు ఆరోన్ ఫించ్, టెస్టు ఫార్మాట్‌కు టిమ్ పైన్ కెప్టెన్‌లుగా వ్యవహరించారు. స్మిత్ పునరాగమనం చేసి ఏడాది కావొస్తుంది. ఈ నేపథ్యంలో చాలా మంది ఆసీస్ మాజీలు, మళ్లీ స్మిత్‌కు పగ్గాలు ఇవ్వాలంటున్న తరుణంలో క్లార్క్‌ మాత్రం స్మిత్‌ కెప్టెన్‌గా సరైన వ్యక్తి కాదంటూ తేల్చి చెప్పాడు.

ఇదీ చూడండి : 'కుంగ్ ఫూ పాండ్య' బ్యాక్.. 37 బంతుల్లో సెంచరీ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details