తెలంగాణ

telangana

ETV Bharat / sports

'వారిని ఓడిస్తే టీమ్ఇండియాదే ప్రపంచకప్'

ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్​లో టీమ్ఇండియా ఫేవరెట్ అని అభిప్రాయపడ్డాడు ఇంగ్లాండ్ మాజీ సారథి మైఖేల్ అథర్టన్. కానీ వారు ఇంగ్లాండ్, వెస్టిండీస్ లాంటి ప్రమాదకరమైన జట్లను ఓడించాల్సి ఉంటుందని తెలిపాడు.

Michael Atherton
అథర్టన్

By

Published : Mar 22, 2021, 2:24 PM IST

ఈ ఏడాది చివర్లో భారత్‌ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ఫేవరెట్​ అని ఇంగ్లాండ్‌ మాజీ సారథి మైఖేల్‌ అథర్టన్‌ అభిప్రాయపడ్డాడు. జట్టులో నైపుణ్యమైన ఆటగాళ్లకు కొదవలేదని, అలాగే స్వదేశంలో ఆడుతుండడం కూడా కోహ్లీసేనకు కలిసివస్తోందని చెప్పాడు. తాజాగా టీమ్‌ఇండియా పొట్టి సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించిన నేపథ్యంలో ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.

టీమ్ఇండియా

"ఐపీఎల్‌ వల్ల టీమ్‌ఇండియాకు బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ దొరికింది. మరో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. అదిప్పుడే ఇంగ్లాండ్‌ వంటి నంబర్‌ వన్‌ జట్టును ఓడించింది. అది కూడా బుమ్రా, షమీ, జడేజాలాంటి కీలక ఆటగాళ్లు లేకుండానే. ఇవన్నీ పక్కనపెడితే పొట్టి ప్రపంచకప్‌ను స్వదేశంలో ఆడుతుండటం టీమ్‌ఇండియాకు సానుకూలాంశం. ఇలాంటి పరిస్థితుల్లో వారు ఫేవరెట్‌గా కనిపిస్తున్నారు. అయితే.. ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌ వంటి జట్లు కూడా ప్రమాదకరమైనవే. వాటిని ఓడిస్తే.. టీమ్‌ఇండియా కచ్చితంగా ఫేవరెట్‌."

-మైఖేల్ అథర్టన్‌, ఇంగ్లాండ్ మాజీ సారథి

టీమ్‌ఇండియా ఇప్పటికే ఇంగ్లాండ్‌ను అటు టెస్టుల్లో, ఇటు టీ20ల్లో ఓడించింది. రేపటి నుంచి మూడు వన్డేల సిరీస్‌ ఆడనుంది. ఈ సిరీస్​లోనూ విజయం సాధించి ఐపీఎల్​లో అడుగుపెట్టాలని చూస్తోంది.

ABOUT THE AUTHOR

...view details