తెలంగాణ

telangana

ETV Bharat / sports

ధోనీపై ఫైనల్లో గెలిచిన విరాట్​ కోహ్లీ - Virat Kohli and MS Dhoni in mens cricketer of decade 2010

గత దశాబ్దపు అత్యుత్తమ క్రికెటర్​​గా నిలిచాడు ప్రస్తుత భారత కెప్టెన్ విరాట్​​ కోహ్లీ. 2010-2019 మధ్య కాలంలో ప్రదర్శన ఆధారంగా పోల్​ నిర్వహించింది క్రిక్​ ఇన్ఫో. ఇందులో వేసిన ఓట్ల ద్వారా ఫైనల్లో ధోనీపై విజయం సాధించాడు విరాట్​.

Men's Cricketer of 2010-2019 Final Won by Virat kohli over MS Dhoni
ధోనీపై ఫైనల్లో గెలిచిన విరాట్​ కోహ్లీ

By

Published : Jan 8, 2020, 5:21 AM IST

టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ, మాజీ సారథి ఎంఎస్‌ ధోనీల్లో ఎవరు అత్యుత్తమం? అనేది చాలా కష్టమైన ప్రశ్న. అయితే ఈ విషయాన్ని తేల్చేందుకు ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫో సంస్థ పెట్టిన ఓ పోటీలోని తుదిపోరులో విజేతగా నిలిచాడు కింగ్​ కోహ్లీ. గత దశాబ్దం(2010-2019)లో ఎక్కువ మంది మెచ్చిన పురుష క్రికెటర్‌ ఎవరు? అనే ప్రశ్నకు... విరాట్​ను ఎక్కువమంది ఎంచుకున్నారు.

ధోనీపై ఫైనల్లో గెలిచిన విరాట్​ కోహ్లీ

ఇలా జరిగింది?

కొంతమంది టాప్​ క్రికెటర్లను ఎంపిక చేసి పోల్‌ నిర్వహించింది క్రిక్​ఇన్ఫో. గతేడాది డిసెంబర్​ 16 నుంచి ఈ ఏడాది జనవరి 5 వరకు పోల్​ సాగింది. ఇందులో కోహ్లీ, ధోనీకి 75 శాతానికి పైగా ఓట్లు రావడం వల్ల ఫైనల్​ చేరారు. తాజాగా సెమీస్‌ ఓటింగ్‌ 2020, జనవరి 7, ఉదయం 10 గంటలకు ముగిసింది. ఇందులో ఫలితాల ఆధారంగా విరాట్​ విజేతగా నిలిచాడు. ఫైనల్లో మహీ, విరాట్​ అభిమానులు భారీ స్థాయిలో ఓట్లు వేసినట్లు ఆ సంస్థ వెల్లడించింది. టాప్​-2లో భారత క్రికెటర్లు నిలవడంపై హర్షం వ్యక్తం చేసిందీ సంస్థ. మూడు, నాలుగు స్థానాల్లో దక్షిణాఫ్రికా క్రికెటర్ డివిలియర్స్​, న్యూజిలాండ్​ సారథి కేన్​ విలియమ్సన్​ నిలిచారు.

రీడర్లు ఓట్లతో మహిళల్లో అత్యత్తమ క్రీడాకారిణిగా భారత జట్టు వన్డే సారథి మిథాలీ రాజ్​ నిలిచింది. ఆ సంస్థ ఉద్యోగుల ఓట్లతో ఆస్ట్రేలియా ఆల్​రౌండర్​ ఎలిస్​ పెర్రీ అగ్రస్థానంలో నిలిచింది. పురుష విభాగంలో రెండిటిలోనూ విరాట్​ గెలవడం విశేషం.

విరాట్​ టాప్​ స్కోరర్​

గత దశాబ్దంలో 27 వేలకు పైగా పరుగుల చేసి, అత్యధిక పరుగుల వీరుడిగా పేరు తెచ్చుకున్నాడు. తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియాకు చెందిన వార్నర్​, లంక మాజీ సారథి సంగక్కర, న్యూజిలాండ్​ సారథి కేన్​ విలియమ్సన్​, ఆస్ట్రేలియా క్రికెటర్​ అరోన్​ ఫించ్​ ఉన్నారు.

గత దశాబ్దంలో అన్ని ఫార్మాట్లలో కలిపి టాప్-5 జాబితా

ఇదీ చదవండి...

ABOUT THE AUTHOR

...view details