తెలంగాణ

telangana

ETV Bharat / sports

'కంగా లీగ్​' దిగ్గజం మెహ్లీ ఇరానీ మృతి - cricket news

మాజీ క్రికెటర్, 'కంగా లీగ్'లో ఎన్నో ఏళ్లపాటు ఆడిన మెహ్లీ ఇరానీ ఇటీవల మృతి చెందారు. ఈయన మృతిపై పలువురు క్రికెటర్లు, అధికారులు సంతాపం తెలుపుతున్నారు.

Mehli Irani, the giant of Kanga League, passes away
'కంగా లీగ్​' దిగ్గజం మెహ్లీ ఇరానీ మృతి

By

Published : Apr 5, 2021, 3:29 PM IST

ముంబయి మాజీ క్రికెటర్, 'కంగా లీగ్' దిగ్గజం మెహ్లీ ఇరానీ(90), దుబాయ్​లో అనారోగ్య కారణాలతో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ముంబయి క్రికెట్ అసోసియేషన్​ అపెక్స్​ కౌన్సిల్ సభ్యుడు నదీమ్ మేనన్ చెప్పారు. మెహ్లీ, శనివారం మరణించారని, ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారని తెలిపారు.

ఎడమ చేతి బ్యాట్స్​మన్ మెహ్లీ ఇరానీ.. 50 ఏళ్ల పాటు 'కంగా లీగ్​'లో ఆడారు. ప్రతి ఏడాది, ముంబయిలో వర్షకాలంలో జరిగే క్రికెట్ లీగ్ ఇది. మెహ్లీ సహచర క్రికెటర్, టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ నరీ కాంట్రాక్టర్.. ఆయన మృతిపై సంతాపం తెలిపారు.

ఇది చదవండి:భారత తొలి మహిళా​ వ్యాఖ్యాత కన్నుమూత

ABOUT THE AUTHOR

...view details