వ్యక్తిని పోలిన వ్యక్తులు ఉంటే వారిని గుర్తుపట్టడం కష్టమే. అదే సెలబ్రిటీల పోలికలతో ఉన్నవాళ్లు అనుకోకుండా మనకు కనిపిస్తే.. నిజంగా వారేనేమో అని భ్రమపడే సందర్భాలు అనేకం. తెలంగాణకు చెందిన అథ్లెట్ రాజ్ మిశ్రాను చూసిన ప్రజలకు ఇలాంటి అనుభవమే ఎదురవుతోంది. అతడు టీమ్ఇండియా పేసర్ బుమ్రాలా కనిపించడమే ఇందుకు కారణం.
బుమ్రా అని భ్రమపడుతున్నారు
చాలా మంది తెలిసినవాళ్లు, తెలియనివారు.. తనను బూమ్రా అనుకుని పలకరిస్తున్నారని చెప్పాడు రాజ్ మిశ్రా. తర్వాత కాదని తెలిసి సారీ చెప్తున్నారని తెలిపాడు. ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లిన ప్రతిసారీ ఇలాంటి అనుభవం ఎదురవుతుందని వెల్లడించాడు.
2019 తెలంగాణ తరఫున జాతీయ స్టేట్ వాకర్ పోటీల్లో పాల్గొని ఐదో స్థానంలో నిలిచాడు రాజ్. ఈ ఏడాది కూడా నేషనల్స్‌లో ఆడాలని భావించానని, అయితే కరోనా వల్ల తన ప్రణాళిక తారుమారైందని చెప్పాడు.
ఇది చూడండి : ఆస్ట్రేలియా ఫస్ట్‌క్లాస్ క్రికెట్ కోసం ఆ బంతి