కడుపునొప్పితో బాధపడుతోన్న టీమ్ఇండియా పేసర్ బుమ్రాను వైద్యబృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని టీమ్ఇండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్ చెప్పాడు. అతడు త్వరగా కోలుకునేందుకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు తెలిపాడు. ఆస్ట్రేలియాతో నాలుగో(చివరి) టెస్టుకు ఇతడు అందుబాటులో ఉండే విషయమై తుది నిర్ణయం శుక్రవారం తీసుకుంటారని అన్నాడు. ఒకవేళ అతడు ఆడగలిగే పరిస్థితిలో ఉంటే తప్పకుండా తుది జట్టులో ఉంటాడని వెల్లడించాడు. మూడో టెస్టు అయిన తర్వాత నుంచి బుమ్రా కడుపునొప్పితో బాధపడుతున్నాడు.
"టీమ్ఇండియా ఆటగాళ్లకు తగిలిన గాయాలను వైద్యబృందం నిత్యం పరిశీలిస్తూనే ఉంది. నాలుగో టెస్టుకు బుమ్రా ఆడుతాడో లేదో తుది నిర్ణయం శుక్రవారం తీసుకుంటారు. అలానే ఈ మ్యాచ్కు సంబంధించి తుది జట్టులో ఆడబోయే 11 మంది పేర్లను రేపు(శుక్రవారం) ప్రకటిస్తారు"