తెలంగాణ

telangana

By

Published : Mar 23, 2019, 7:00 AM IST

ETV Bharat / sports

'భారత్​, ఇంగ్లండ్​లే ప్రపంచకప్​ ఫేవరెట్లు'

మే 30న ప్రారంభంకానున్న వన్డే ప్రపంచకప్​లో భారత్​, ఇంగ్లండ్​ ఫేవరెట్​ జట్లుగా ఆసిస్‌ మాజీ ఆటగాడు గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ వెల్లడించారు. ఈ రెండు జట్లకే టైటిల్​ గెలిచే అవకాశం ఎక్కువగా ఉందన్నారు.

భారత్​, ఇంగ్లండ్ ప్రపంచకప్​ ఫేవరెట్లు: మెక్​గ్రాత్​​

వరల్డ్‌కప్‌ ఫేవరెట్‌లలో భారత్​ నిలవడానికి బలమైన బౌలింగ్​ లైనప్​ ఒక కారణమని ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు గ్లెన్​ మెక్​గ్రాత్​ వ్యాఖ్యానించాడు. ఇటీవల సిరీస్​లో భారత జట్టును ఓడించిన ఆస్ట్రేలియా సైతం పుంజుకుంటుందన్నాడు.

"ప్రపంచకప్​న​కు భారత్‌, ఇంగ్లండ్‌లు భారీ అంచనాలతో బరిలోకి దిగుతున్నాయి. ఇటీవల వెస్టిండీస్‌లో జరిగిన వన్డే సిరీస్​ను ఇంగ్లండ్‌ అతి కష్టం మీద డ్రాగా ముగించింది. మరోవైపు స్వదేశంలో జరిగిన రెండు ద్వైపాక్షిక సిరీస్​లను భారత్​ కోల్పోయింది. అయితే వీటికి టైటిల్​ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. భారత్​ను ఓడించిన ఆస్ట్రేలియాకు అవకాశాలు మెరుగయ్యాయి."
-ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్​, మెక్​గ్రాత్​

అన్ని విభాగాల్లో భారత్‌, ఇంగ్లండ్‌ జట్లు పటిష్ఠంగా మారాయని.. భారత క్రికెట్‌ జట్టు సారథి కోహ్లీ ఓ గొప్ప ఆటగాడంటూ మెక్‌గ్రాత్‌ కితాబిచ్చాడు. విరాట్​ను అసాధారణ క్రికెటర్​గా పేర్కొంటూ...అతని కెరీర్‌ ముగిసే సమయానికి సచిన్‌ తెందూల్కర్​, బ్రయాన్‌ లారా సరసన చరిత్రలో నిలిచిపోతాడని అభిప్రాయపడ్డాడు. అదే సమయంలో భారత్‌ బౌలర్లు బుమ్రా, మహ్మద్‌ షమీ, భువనేశ్వర్‌ కుమార్‌, ఇషాంత్‌ శర్మలతో పేస్​ విభాగం కూడా దృఢంగా ఉందన్నాడీ మాజీ పేసర్.

ABOUT THE AUTHOR

...view details