తెలంగాణ

telangana

ETV Bharat / sports

'టెస్టు ఛాంపియన్​షిప్​కు గండి పడింది అక్కడే!' - ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​

వరల్డ్​ టెస్టు ఛాంపియన్​షిప్​ పోటీలో తమ జట్టు లేకపోవడం నిరాశకు గురిచేసిందని ఆస్ట్రేలియా కోచ్​ జస్టిన్​ లాంగర్​ అన్నాడు. టీమ్ఇండియాతో ఆడిన మెల్​బోర్న్​ టెస్టులో తమ టీమ్ స్లో ఓవర్​ రేటు బౌలింగ్​ కారణంగా ఈ పోటీకి దూరమైనట్లు అభిప్రాయపడ్డాడు.

MCG over-rate fine cost us WTC final: Justin Langer
'టెస్టు ఛాంపియన్​షిప్​కు గండి పడింది అక్కడే!'

By

Published : Mar 9, 2021, 5:20 PM IST

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పోటీలో ఆస్ట్రేలియా లేకపోవడం నిరాశకు గురిచేసిందని ఆ జట్టు కోచ్​ జస్టిన్​ లాంగర్​ అన్నాడు. అందుకు టీమ్‌ఇండియాతో ఆడిన మెల్‌బోర్న్‌ టెస్టులో తమ స్లో ఓవర్‌ రేట్‌ బౌలింగే కారణమని ఆయన అభిప్రాయపడ్డాడు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

"ఆ మ్యాచ్‌ ముగిశాక మా ఆటగాళ్లతో మాట్లాడాను. వారికి జరిగిన విషయం వివరించాను. రెండు ఓవర్లు స్లో బౌలింగ్‌ చేశామని, అది టెస్టు ఛాంపియన్‌షిప్‌ అవకాశాలను దూరం చేసే పరిస్థితి కల్పించొచ్చని అన్నాను. తర్వాత ఆడే సిడ్నీ, గబ్బా టెస్టుల్లో అలాంటి తప్పు జరగకూడదని చెప్పాను. అది బాగా నిరాశ కలిగించింది. ఒక గుణపాఠంలా అనిపించింది. ఇకపై జాగ్రత్తగా ఉండాలనే విషయం నేర్పింది."

- జస్టిన్​ లాంగర్​, ఆస్ట్రేలియా కోచ్​

గతేడాది డిసెంబర్‌ 26న భారత్‌, ఆస్ట్రేలియా జట్లు మెల్‌బోర్న్‌ వేదికగా బాక్సింగ్‌ డే టెస్టులో తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో అజింక్య రహానె సెంచరీ సాధించి జట్టును విజయపథంలో నడిపించాడు. అయితే, ఆ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు నిర్ణీత సమయం కన్నా ఆలస్యంగా బౌలింగ్‌ చేసింది. దాంతో టెస్టు ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో నాలుగు పాయింట్లు కోతకు గురైంది.

ఇదిలా ఉండగా, ఆస్ట్రేలియా ఇటీవల దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్‌ ఆడాల్సి ఉంది. అయితే, అక్కడ కరోనా కేసుల్లో పెరుగుదల కారణంగా కంగారూల జట్టు సిరీస్‌ను రద్దు చేసుకుంది.

మరోవైపు ఆసీస్​తో జరిగిన బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌ను 2-1 తేడాతో టీమ్‌ఇండియా కైవసం చేసుకోవడం సహా.. స్వదేశంలో ఇంగ్లాండ్‌ను 3-1 తేడాతో ఓడించడం వల్ల టెస్టు ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో అగ్రస్థానం సంపాదించింది. దాంతో జూన్‌ 18న సౌథాంప్టన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో తుదిపోరుకు సిద్ధపడింది.

ఇదీ చూడండి:'ఐసీసీ ప్లేయర్​ ఆఫ్ ది మంత్​'గా అశ్విన్​

ABOUT THE AUTHOR

...view details