మన్కడింగ్ విషయంలో అశ్విన్‌కు మద్దతు పలికిన ఎంసీసీ.. తాజాగా మాట మార్చింది. రనౌట్ నిర్ణయం సరైనదంటూ అభిప్రాయపడిన ఎంసీసీ ఒక్కరోజులోనే మరో మాట మాట్లాడటం క్రికెట్ అభిమానులను విస్మయానికి గురిచేసింది.
"ఘటనపై పూర్తి విచారణ అనంతరం ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా జరిగిందని తేల్చాం. బంతి వేయడానికి అశ్విన్ ఎక్కువ సమయం తీసుకున్నాడు. నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న బట్లర్ ఊహించిన సమయం కంటే బంతి ఆలస్యంగా వేశాడు."
- ఫ్రేజర్ స్టీవార్ట్,ఎంసీసీ మేనేజర్
ఒకరోజు క్రితం ఎంసీసీ ఏం చెప్పింది..??
'ఉద్దేశపూర్వకంగానో, లాభం కోసమో నాన్ స్ట్రైకర్ క్రీజు దాటితే హెచ్చరిక ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది క్రికెట్ నిబంధనలో ఉంది. అలాంటి సమయంలో చేసిన రనౌట్ క్రీడా స్ఫూర్తికి వ్యతిరేకం కాదు' అంటూ అశ్విన్ చర్యను సమర్థించింది. బంతి వేయకుండానే నాన్ స్ట్రైకర్ లైన్ దాటడం తప్పు అంటూ బట్లర్ చర్యను పరోక్షంగా తప్పుపట్టింది.
నిబంధన 41.16 పై వివరణ ఇచ్చిన 'మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్' మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ 1788లో క్రికెట్ నిబంధనలు రూపొందించింది. ప్రస్తుతం ఈ అంశాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చూస్తోంది. ఈ నిబంధనల అంశాలపై కాపీరైట్ హక్కులు మాత్రం ఎంసీసీ పేరిట ఉన్నాయి.