పుణె వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న రెండో టెస్టులో తొలిరోజు ఆధిపత్యం కొనసాగించింది టీమిండియా. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీసేనకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి టెస్టులో రెండు సెంచరీలతో చెలరేగిన రోహిత్, 14 పరుగులకే పెవిలియన్ చేరాడు. అనంతరం పుజారాతో కలిసి మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.
ఈ క్రమంలో మయాంక్.. మరోసారి సెంచరీతో మెరిశాడు. పుజారా అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. వీరిద్దరూ రెండో వికెట్కు 138 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అనంతరం పుజారా (58).. రబాడ బౌలింగ్లో వెనుదిరిగాడు. కాసేపటికే మయాంక్ (108)ను ఔట్ చేసి సఫారీ జట్టులో ఆనందాన్ని నింపాడీ బౌలర్.