టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్(105) మరో శతకంతో ఆకట్టుకున్నాడు. పుణె వేదికగా జరుగుతోన్న భారత్-దక్షిణాఫ్రికా రెండో టెస్టులో 188 బంతుల్లో 105 పరుగులు చేసి, కెరీర్లో రెండో సెంచరీ నమోదు చేశాడు. ఇందులో 16 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ప్రస్తుతం బ్యాటింగ్ కొనసాగిస్తూ.. దక్షిణాఫ్రికా బౌలర్లను దీటుగా ఎదుర్కొంటున్నాడు.
విశాఖపట్నం వేదికగా జరిగిన తొలిటెస్టులో ద్విశతకం(215) చేసిన మయాంక్.. ఈ మ్యాచ్‌లోనూ సత్తాచాటుతున్నాడు. దక్షిణాఫ్రికాపై ఇలా వరుస సెంచరీలు చేసిన రెండో టెస్టు ఓపెనర్‌గా రికార్డు సృష్టించాడు. 2009-10 సీజన్లో వీరేంద్ర సెహ్వాగ్ ఈ ఘనత అందుకున్నాడు.