బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ద్విశతకంతో ఆకట్టుకున్న మయాంక్ అగర్వాల్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. తక్కువ ఇన్నింగ్స్‌ల్లో(12) రెండు డబుల్ సెంచరీలు చేసిన మయాంక్ క్రికెట్ దిగ్గజం సర్ డాన్ బ్రాడ్‌మన్ రికార్డు బ్రేక్ చేశాడు. బ్రాడ్‌మన్ 13 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు.
మయాంక్ కంటే ముందు వినూ మన్కండ్ ఈ రికార్డు అందుకున్నాడు. 1955-56 సీజన్లో 5 ఇన్నింగ్స్‌ల్లోనే రెండు ద్విశతకాలు చేశాడు.
ఒక్కరోజులో 200 పైచిలుకు పరుగులు చేసిన భారత బ్యాట్స్మెన్లలో మయాంక్ ఆరో స్థానంలో ఉన్నాడు. రెండో రోజైన శుక్రవారం 206 పరుగులు చేశాడు.
- 2009-10 సీజన్లో శ్రీలంకపై సెహ్వాగ్ ఒకే రోజు 284 పరుగులు చేశాడు.
- 2007-08 సీజన్లో దక్షిణాఫ్రికాపై సెహ్వాగ్ మరోసారి 257 పరుగులు.
- 2016-17 సీజన్లో కరుణ్ నాయర్.. ఇంగ్లాండ్‌పై 232 పరుగులు.
- 2003-04 సీజన్లో సెహ్వాగ్.. పాకిస్థాన్‌పై 228 పరుగులు.
బంగ్లాదేశ్‌పై అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన భారత బ్యాట్స్మెన్ల జాబితాలో మయాంక్ రెండో స్థానంలో ఉన్నాడు. 248 పరుగులతో సచిన్ ముందువరుసలో ఉన్నాడు.
ఇదీ చదవండి: బంగ్లా బౌలర్లకు చుక్కల్.. మయాంక్ 'డబుల్' మెరుపుల్