తెలంగాణ

telangana

ETV Bharat / sports

నెల వ్యవధిలో మయాంక్ రెండో 'డబుల్'

ఇండోర్ వేదికగా బంగ్లాతో జరుగుతున్న మ్యాచ్​లో మయాంక్ అగర్వాల్ ద్విశతకంతో ఆకట్టుకున్నాడు. కెరీర్​లో రెండో డబుల్ సెంచరీ చేశాడీ భారత ఓపెనర్.

By

Published : Nov 15, 2019, 3:58 PM IST

నెల వ్యవధిలో మయాంక్ రెండో డబుల్

బంగ్లాదేశ్​తో జరుగుతున్న తొలి టెస్టులో భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ద్విశతకంతో విజృంభించాడు. ఇండోర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్​లో 304 బంతుల్లో రెండు వందల పరుగుల మార్కును అధిగమించాడు. ఇందులో 25 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి.

సిక్సర్​తో డబుల్..

196 పరుగుల వద్ద మెహదీ హసన్ బౌలింగ్​లో సిక్సర్ బాది డబుల్ సెంచరీ పూర్తి చేశాడు మయాంక్ అగర్వాల్. గతంలో సెహ్వాగ్ కూడా ఇదే మాదిరిగా సిక్సర్​తో ద్విశతకం సాధించాడు.

టెస్టు కెరీర్​లో ఇప్పటివరకు మూడు శతకాలు చేశాడు మయాంక్. ఇందులో రెండు డబుల్ సెంచరీలు ఉండడం విశేషం. ఇటీవల విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్​లో 215 పరుగులు చేశాడీ టీమిండియా ఓపెనర్.

తక్కువ ఇన్నింగ్స్​ల్లో(12) డబుల్ సెంచరీ చేసిన ఆటగాళ్లల్లో మయాంక్ అగర్వాల్ రెండో స్థానంలో ఉన్నాడు. 5 ఇన్నింగ్స్​ల్లో ద్విశతకం చేసిన వినోద్ కాంబ్లీ మొదటి స్థానంలో ఉన్నాడు.

ఇదీ చదవండి: హాంకాంగ్ ఓపెన్ సెమీ ఫైనల్లో​ కిదాంబి శ్రీకాంత్

ABOUT THE AUTHOR

...view details