తెలంగాణ

telangana

ETV Bharat / sports

డబుల్​ సెంచరీతో ఆనందం డబుల్ అయింది: మయాంక్​ - mayank agerwal

విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ద్విశతకంతో ఆకట్టుకున్నాడు మయాంక్ అగర్వాల్. ఈ శతకం చేసినందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పాడు. ఈ మ్యాచ్​లో తన ఆట తీరు నచ్చిందని తెలిపాడు.

మయాంక్ అగర్వాల్

By

Published : Oct 3, 2019, 10:27 PM IST

తన తొలి సెంచరీనే ద్విశతకంగా మలిచినందుకు చెప్పలేనంత ఆనందంగా ఉందని చెప్పాడు టీమిండియా యువ ఓపెనర్​ మయాంక్ అగర్వాల్. ఈ మ్యాచ్​లో తన ఆటతీరు ఎంతో నచ్చిందని చెప్పాడు.

"బాగా ఆడినందుకు సంతోషంగా ఉంది. రోహిత్​తో కలిసి 300పైగా భాగస్వామ్యం నెలకొల్పడం గొప్పగా ఉంది. ఇద్దరి మధ్య చక్కని సమన్వయం కుదిరింది. ప్రతిసారి 450-500 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పితే ప్రత్యర్థికి కష్టమవుతుంది. మొదట నిలకడగా ఆడాం. ఆ తర్వాత దూకుడు పెంచి 300 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాం" -మయాంక్ అగర్వాల్​, టీమిండియా ఓపెనర్​

టీ విరామం తర్వాత బంతి స్వింగ్ అయిందని చెప్పాడు మయాంక్

"రోహిత్‌ స్పిన్నర్లపై దూకుడుగా ఆడుతుంటే చూడటానికి ఎంతో బాగుంది. రెండో రోజు భోజన విరామం తర్వాత బంతి బౌన్స్‌ తక్కువగా ఉంది. తేనీటి విరామానికి తిరిగడం మొదలైంది. ఇది మాకు శుభ పరిణామం. అశ్విన్‌, జడేజా చక్కని ప్రాంతాల్లో బంతులు విసిరి సఫారీలపై ఒత్తిడి పెంచారు" -మయాంక్ అగర్వాల్​, టీమిండియా ఓపెనర్​

371 బంతులాడిన మయాంక్ 23 బౌండరీలు, 6 సిక్సర్ల సాయంతో 215 పరుగులు చేశాడు. రోహిత్‌ శర్మ (176; 244 బంతుల్లో 23×4, 6×6)తో కలిసి తొలి వికెట్‌కు 317 పరుగుల భారీ భాగస్వామ్యం అందించాడు.

ఇదీ చదవండి: బౌలింగ్​లోనూ భారత్ భేష్​​.. కష్టాల్లో సఫారీ జట్టు

ABOUT THE AUTHOR

...view details