న్యూజిలాండ్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో ఓపెనర్ మయాంక్ అగర్వాల్(34; 84 బంతుల్లో 5x4) తొలి సెషన్ మొత్తం క్రీజులో ఉండి అరుదైన రికార్డు నెలకొల్పాడు. నేపియర్ వేదికగా 1990లో కివీస్‌తో జరిగిన రెండో టెస్టులో ఓపెనర్‌గా వచ్చిన మనోజ్ ప్రభాకర్ మొదటిసారి అలా తొలి సెషన్ మొత్తం బ్యాటింగ్ చేశాడు. అతడి తర్వాత 30 ఏళ్లకు మయాంక్ అగర్వాల్ శుక్రవారం తొలి టెస్టులో అదే ఘనత సాధించాడు. వీరిద్దరు మినహా ఏ భారత ఓపెనర్ కూడా న్యూజిలాండ్ గడ్డపై టెస్టుల్లో తొలి సెషన్ మొత్తం బ్యాటింగ్ చేసిన సందర్భాలు లేవు.
కివీస్‌తో తొలిటెస్టులో మయాంక్ అరుదైన ఘనత - Mayank Agarwal
న్యూజిలాండ్‌తో జరుగుతోన్న మొదటి టెస్టులో టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అరుదైన ఘనత సాధించాడు. తొలిరోజు మొదటి సెషన్ మొత్తం బ్యాటింగ్ చేసిన ఈ ఆటగాడు ఓ రికార్డు సృష్టించాడు.
మయాంక్
భోజన విరామం అనంతరం మయాంక్.. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో జేమిసన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆది నుంచి తడబడుతోంది. ఓపెనర్ పృథ్వీషా(16), నయా వాల్ పుజారా(11), కెప్టెన్ విరాట్ కోహ్లీ(2), మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ హనుమ విహారి(7) పూర్తిగా విఫలయమ్యారు.
Last Updated : Mar 2, 2020, 1:10 AM IST