మైదానంలో ధోని చురుకుదనం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వికెట్ల వెనుక క్యాచ్ పట్టినా, కళ్లు మూసి తెరిచే లోపు స్టంప్ చేసినా, వికెట్లనే చూడకుండా స్టైల్‌గా రనౌట్‌కు బంతి విసిరినా ఆ ప్రత్యేకతే వేరు. మెరుపు ఫీల్డింగ్‌తో ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటాడు ధోని. రాంచీ వేదికగా జరుగుతోన్న మూడో వన్డేలోనూ అద్భుతమైన రనౌట్‌లో భాగమయ్యాడు.
రనౌట్ ఇలా..
47 పరుగులతో అర్ధ శతకానికి చేరువలో ఉన్నాడు మాక్స్వెల్. బంతిని బలంగా బాదిన షాన్ మార్ష్ రన్‌కు యత్నించాడు. అవతలి ఎండ్‌లో ఉన్న మాక్స్వెల్ రన్ కోసం పరిగెత్తాడు. చురుగ్గా స్పందించిన జడేజా వేగంగా బంతిని ధోని వైపు విసిరాడు. బంతిని అందుకుని కొట్టే సమయం లేక నేరుగా వికెట్లకు తగిలేలా చేయి పెట్టాడు ధోని. ఇంకేముంది...మాక్స్వెల్ పెవిలియన్ బాట పట్టక తప్పలేదు.
ఈ మ్యాచ్‌లో 313 పరుగుల భారీ స్కోరు చేసింది ఆస్ట్రేలియా. ఆ జట్టు ఓపెనర్లు ఇద్దరూ చెలరేగి మొదటి వికెట్‌కు 193 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్ టీమిండియా సొంతమవుతుంది.