ఆస్ట్రేలియాకు చెందిన స్టార్ క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్.. ఇటీవల కాలంలో కొన్ని రోజులు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత మళ్లీ మ్యాచ్‌లు ఆడేందుకు సన్నద్ధమయ్యాడు. అయితే ఆటకు ఎందుకు తాత్కాలిక విరామం ఇవ్వాల్సి వచ్చిందో తాజాగా వెల్లడించాడు.
"కొన్ని రోజుల విశ్రాంతి తర్వాత నేను స్వింగ్‌లోకి వచ్చేశా. దాదుపు నాలుగైదు ఏళ్లుగా ఖాళీ లేకుండా అన్ని ప్రాంతాలు తిరిగా. ఇందువల్లే మానసికంగా, శారీరకంగా చాలా అలసిపోయి సమస్యలు ఎదుర్కొన్నా. చాలా ఇబ్బందిగా అనిపించేది. అందువల్లే దేనిపైనా దృష్టి పెట్టలేకపోయా. అలాంటి సమయంలో నా సమస్యను గుర్తించిన వ్యక్తి నా భాగస్వామి. విశ్రాంతి తీసుకోమని నాకు సలహా ఇచ్చింది. రెండు నెలలు తాత్కాలికంగా ఆటకు సెలవు పెట్టా. ప్రస్తుతం భుజాలపై నుంచి భారం దిగినట్లు ఉంది. నా సమస్యను అర్థం చేసుకుని విరామాన్ని ఇచ్చిన క్రికెట్ ఆస్ట్రేలియాకు ధన్యవాదాలు"
- మ్యాక్స్‌వెల్, క్రికెటర్