ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఆ జట్టు బ్యాట్స్‌మన్ మాథ్యవేడ్ టీమ్‌ఇండియా యువ వికెట్ కీపర్ పంత్‌పై నోరు పారేసుకున్నాడు. "మళ్లీ నిన్ను నువ్వు పెద్ద స్క్రీన్ మీద చూసుకుంటున్నావా? నువ్వు అలా చూసుకోవడం చాలా సరదాగా ఉంది" అని అన్నాడు. ఆ మాటలు స్టంప్ మైక్‌లో వినిపించడం వల్ల ఓ ఆస్ట్రేలియా క్రికెట్ వెబ్‌సైట్ ఆ వీడియోను ట్విటర్‌లో పంచుకుంది.
పంత్‌పై నోరు పారేసుకున్న ఆసీస్ క్రికెటర్ - పంత్ వార్తలు
బాక్సింగ్ డే టెస్టులో ఆసీస్ బ్యాట్స్‌మన్ వేడ్, భారత వికెట్ కీపర్ పంత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఆ వీడియోను ఆస్ట్రేలియాకు చెందిన ఓ వార్తా సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
సోమవారం మూడోరోజు ఆటలో భాగంగా ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ షాట్లు ఆడలేకపోవడం, భారత బౌలింగ్‌ను సరిగ్గా ఎదుర్కోవడంలో ఇబ్బంది పడిన సందర్భాల్లో పంత్ నవ్వుతూ కనిపించడంపై వేడ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. రెండో సెషన్ పూర్తయ్యాక టీ విరామంలో ఓ వార్తా సంస్థతో మాట్లాడిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్.. పంత్‌పై మరోసారి తన అక్కసును ప్రదర్శించాడు. టీమ్‌ఇండియా కీపర్ ఏమీ మాట్లాడకుండా ఎప్పుడూ నవ్వుతుంటాడని వేడ్ పేర్కొన్నాడు. తమను చూసి అలా నవ్వడంలో ఏం జోక్ ఉందో అర్థం కావడం లేదన్నాడు. బహుశా తన బ్యాటింగ్ చూసి పంత్ నవ్వుతుండొచ్చని చెప్పాడు.
ఈ మ్యాచ్‌లో భారత్ మెరుగైన ప్రదర్శన చేసింది. 277/5 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించి, 326 పరుగులకు ఆలౌటైంది. రహానె(112), జడేజా(57) ఔటయ్యాక టెయిలెండర్లు పెద్దగా ఆడలేదు. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి 133/6తో నిలిచింది. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అధిగమించి 2 పరుగులు ఎక్కువ సాధించింది. అంతకుముందు 99 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఆసీస్ ఇన్నింగ్స్ ఓటమిపాలయ్యేలా కనిపించింది. చివర్లో కామరూన్ గ్రీన్(17), పాట్ కమిన్స్(15) నిలకడగా ఆడి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు.