తెలంగాణ

telangana

ETV Bharat / sports

భళా వేడ్​.. నీలో ఓ మైఖెల్ జాక్సన్​ ఉన్నాడుగా..! - మాథ్యూ వేడ్

న్యూజిలాండ్ బౌలర్లు వేసిన బౌన్సర్లకు ఆస్ట్రేలియా బ్యాట్స్​మెన్ కాస్త ఇబ్బందిపడ్డారు. ఆసీస్ కీపర్ బ్యాట్స్​మెన్ వేడ్​ ఏకంగా ఓసారి కిందపడిపోయాడు. ఈ క్రమంలో అతడి పోజు ప్రఖ్యాత పాప్ సింగర్ మైఖెల్ జాక్సన్​ను తలపించింది.

Matthew Wade
వేడ్

By

Published : Dec 26, 2019, 4:44 PM IST

ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతోన్న టెస్టులో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఆసీస్‌ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌ మాథ్యూ వేడ్‌.. న్యూజిలాండ్‌ బౌలర్ల బౌన్సులు, యార్కర్లు తట్టుకోలేక ఒకసారి కిందపడిపోయాడు. ఈ క్రమంలో ప్రపంచ ప్రఖ్యాత డ్యాన్సర్‌, దివంగత పాప్‌ సింగర్‌ మైఖెల్‌ జాక్సన్‌లా కనువిందు చేశాడు.

జాక్సన్‌ వేసే యాంటీ గ్రావిటేషనల్ స్టెప్‌ను అనుసరించినట్లుగా వేడ్ కనిపించాడు. శరీర బరువుని అదుపులో పెట్టుకొని ముందుకు సాగినట్లు కనిపించడం వల్ల ఆస్ట్రేలియాకు చెందిన ఓ క్రీడా వెబ్‌సైట్‌ ఈ ఫొటోను ట్విట్టర్‌లో పోస్టు చేసింది.

ఈ మ్యాచ్​లో వేడ్ 38 పరుగులు చేసి గ్రాండ్​హోమ్ బౌలింగ్​లో ఔటయ్యాడు. స్మిత్ (77), లబుషేన్ (63) అర్ధశతకాలతో రాణించారు. ఫలితంగా తొలిరోజు ఆట పూర్తయ్యే సరికి ఆసీస్​ నాలుగు వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది.

ఇవీ చూడండి.. దక్షిణాఫ్రికాతో టెస్టులో అండర్సన్​ రికార్డు

ABOUT THE AUTHOR

...view details