వచ్చే ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్‌నకు ఆతిథ్యం ఇవ్వనుండటం ఎంతో గౌరవాన్ని తెచ్చిపెడుతుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ చెప్పాడు. ఐసీసీ టోర్నీని నిర్వహించడానికి బోర్డు అధ్యక్షుడిగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.
"పురుషుల టీ20 ప్రపంచకప్‌నకు ఆతిథ్యం ఇవ్వడం మాకెంతో గౌరవం. 1987లో వన్డే ప్రపంచకప్ నుంచి అనేక అంతర్జాతీయ ఈవెంట్లను భారత్ విజయవంతంగా నిర్వహించింది. ఇక్కడ ఆడేందుకు క్రికెటర్లంతా ఉత్సాహంగా ఉంటారని నేను కచ్చితంగా భావిస్తున్నాను. ఐసీసీ ఈవెంట్లలో పాల్గొనడాన్ని ఆటగాడిగా ఆస్వాదించాను. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది చూసే క్రికెట్ మ్యాచ్‌లను మరేదీ అధిగమించలేదని నా అనుభవం నుంచి తెలుసుకున్నాను. ప్రపంచకప్ నిర్వహించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను"