తెలంగాణ

telangana

ETV Bharat / sports

దిల్లీలో భారత్-బంగ్లా మ్యాచ్​ జరుగుతుంది: గంగూలీ - బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ

కాలుష్యం కారణంగా భారత్​-బంగ్లా టీ20 జరుగుతుందా లేదా అనే విషయంపై స్పష్టతనిచ్చాడు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ. దిల్లీలో​ మ్యాచ్​ కచ్చితంగా అవుతుందని చెప్పాడు.

బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ

By

Published : Oct 31, 2019, 12:41 PM IST

Updated : Oct 31, 2019, 2:49 PM IST

బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ.. దిల్లీలో భారత్-బంగ్లాదేశ్​ టీ20 మ్యాచ్​పై స్పష్టతనిచ్చాడు. అనుకున్న ప్రణాళిక ప్రకారం జరుగుతుందని అన్నాడు.

దిల్లీ గాలి కాలుష్యం తారస్థాయికి చేరుకుంది. నగరంలో కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. ఈ కారణంగానే చాలా మంది మ్యాచ్​ వేదికను మార్చాలని బీసీసీఐని కోరారు. అయితే గంగూలీ తాజా వ్యాఖ్యలతో అది జరగడం అసాధ్యమని తేలింది.

బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ

భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్​ ఈ విషయంపై బుధవారం మాట్లాడాడు. ప్రజలు.. క్రికెట్ కంటే కాలుష్యం తగ్గించేలా శ్రద్ధ వహించాలని అన్నాడు.

"దిల్లీలో మ్యాచ్​ జరగడం కన్నా.. ఇది చాలా తీవ్రమైన సమస్య. స్థానిక ప్రజలు క్రికెట్ మ్యాచ్​ కంటే కాలుష్య స్థాయిలపై దృష్టి సారించాలని భావిస్తున్నాను" -గౌతమ్ గంభీర్, మాజీ క్రికెటర్

భారత్-బంగ్లాదేశ్​ మధ్య మూడు మ్యాచ్​ల సిరీస్​లో భాగంగా తొలి టీ20 వచ్చే నెల 3న అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది.

ఇది చదవండి: దిల్లీ మ్యాచ్​కు కాలుష్య ముప్పు ఉండకపోవచ్చు: బీసీసీఐ

Last Updated : Oct 31, 2019, 2:49 PM IST

ABOUT THE AUTHOR

...view details