తెలంగాణ

telangana

ETV Bharat / sports

కేపీఎల్‌ ఫిక్సింగ్‌ కేసులో అంతర్జాతీయ బుకీ అరెస్టు

కర్ణాటక ప్రీమియర్​ లీగ్​(కేపీఎల్​) మ్యాచ్​ ఫిక్సింగ్​ కేసులో పురోగతి లభించింది. పలు మ్యాచ్​లను ఫిక్సింగ్​ చేసేందుకు ప్రయత్నించిన ఓ అంతర్జాతీయ బుకీని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు హరియాణాకు చెందిన సయ్యమ్​ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

కేపీఎల్‌ ఫిక్సింగ్‌ కేసులో అంతర్జాతీయ బుకీ అరెస్టు

By

Published : Nov 10, 2019, 3:29 PM IST

కర్ణాటక ప్రీమియర్‌ లీగ్‌(కేపీఎల్‌) మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కేసులో పురోగతి లభించింది. హరియాణాకు చెందిన సయ్యమ్‌ అనే అంతర్జాతీయ బుకీని సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఆర్సీబీ జట్టు ప్రముఖ డ్రమ్మర్‌ భవేశ్‌ బఫ్నను కూడా ఇదే కేసులో గతంలో అరెస్టు చేశారు. బఫ్నా గత నెలలో పోలీసులకు చిక్కి కస్టడీలో ఉన్నాడు.

సయ్యమ్‌ పోలీసుల కళ్లుగప్పి వెస్టిండీస్‌లో దాక్కున్నాడనే సమాచారంతో ఇదివరకే అతడిపై లుకౌట్‌ నోటీసులు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

కేపీఎల్‌ ఫిక్సింగ్‌ కేసులోనే బళ్లారి టస్కర్స్ జట్టు కెప్టెన్‌ సీఎం గౌతమ్‌, అబ్రార్‌ కాజీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడి ఇటీవల అరెస్టయ్యారు. ఆగస్టు 31న జరిగిన కేపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో టస్కర్‌, హుబ్లి టైగర్స్‌ తలపడ్డాయి. తుది పోరులో ఈ ఇద్దరూ ఫిక్సింగ్‌కు పాల్పడి నెమ్మదిగా బ్యాటింగ్‌ చేసేందుకు రూ.20 లక్షలు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ మ్యాచ్‌ కంటే ముందు బెంగళూరు జట్టుతో జరిగిన వేరే మ్యాచ్‌లోనూ గౌతమ్‌, అబ్రార్‌ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details