తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆ చట్టం వస్తే క్రికెట్​లో భారత్ 'గేమ్​ ఛేంజర్' - Steve Richardson

ఫిక్సింగ్​ను క్రిమినల్​ కేసుగా పరిగణించేలా భారత్​లో చట్టాన్ని రూపొందించాలని ఐసీసీ అవినీతి నిరోధక శాఖ అధికారి స్టీవ్​ రీచర్డ్​సన్ సూచించారు​. తద్వారా క్రికెట్​లో భారత్ 'గేమ్​ ఛేంజర్'​ అవుతుందని అభిప్రాయపడ్డారు.

ఆ చట్టం వస్తే క్రికెట్​లో భారత్ 'గేమ్​ ఛేంజర్'
బీసీసీఐ

By

Published : Jun 25, 2020, 2:22 PM IST

క్రికెట్​లో మ్యాచ్​ ఫిక్సింగ్​ను క్రిమినల్​ కేసుగా పరిగణించి, భారత్​లో కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని సూచించారు ఐసీసీ అవినీతి నిరోధక శాఖ అధికారి స్టీవ్​ రిచర్డ్​సన్​. ఇలా చేయడం వల్ల క్రికెట్​లో భారత్.. 'గేమ్​ ఛేంజర్'​ అవుతుందని అన్నారు. మ్యాచ్​ ఫిక్సర్ల నుంచి క్రికెట్​ను కాపాడుకునేందుకు ఉన్న ఏకైక మార్గం ఇదేనని చెప్పారు.

"రానున్న రెండేళ్లలో భారత్.. టీ20 ప్రపంచకప్(2021)​, వన్డే ప్రపంచకప్(2023)లకు​ ఆతిథ్యం ఇవ్వనుంది. వీటిని చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపుతారు. దీనినే ఆసరాగా తీసుకుని ఫిక్లర్సు ఆటగాళ్లకు వలవేసే అవకాశాలు ఎక్కువుగా ఉంటాయి. ఇలాంటి సమయంలో క్రికెట్​ను అవినీతిపరుల నుంచి కాపాడుకోవడమనేది పెద్ద సవాలు లాంటిది. కాబట్టి ఇటువంటి అవినీతి చర్యలకు పాల్పడే వారిని కట్టడి చేయాలంటే మ్యాచ్ ​ఫిక్సింగ్​కు వ్యతిరేకంగా భారత్​లో ఓ కఠినమైన చట్టాన్ని రూపొందించాల్సిన అవసరముంది. సరైన చట్టం లేకపోతే దొంగ దారి తొక్కినోళ్లను అధికారులూ ఏమి చేయలేరు. ఐసీసీ తనకున్న పరిధిలో ఇలాంటి అవినీతి చర్యలను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. కాబట్టి కఠినమైన శిక్షలు అమలు చేసేలా చట్టాన్ని రూపొందిస్తే భారత క్రికెట్​ చరిత్రలోనే 'గేమ్​ ఛేంజర్'​గా తయారవుతుంది"

-స్టీవ్​ రిచర్డ్​సన్, ఐసీసీ అవినీతి నిరోధక శాఖ అధికారి

భారతదేశంలో చాలామంది నేరగాళ్లు శిక్ష నుంచి తప్పించుకుని స్వేచ్ఛగా తిరుగుతున్నారని స్టీవ్ ఆరోపించారు​. ఐసీసీ దర్యాప్తు చేసే కేసుల్లో 50 శాతం మంది అవినీతిపరులు భారత్​కు చెందిన వారే ఉన్నారని వెల్లడించారు.

మ్యాచ్​ ఫిక్సింగ్​ను క్రిమినల్​ కేసుగా పరిగణించి, అవినీతికి పాల్పడిన వారికి పదేళ్లు జైలు శిక్ష విధించేలా 2019లో చట్టాన్ని తీసుకొచ్చిన తొలి దక్షిణాసియా దేశం శ్రీలంక.

శ్రీలంక

ఇదీ చూడండి : ధోనీ ముఖ్య అతిథిగా భారత​ ఆర్చర్ల పెళ్లి

ABOUT THE AUTHOR

...view details