భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్‌కు క్రికెట్లో సాటెవరు..? అతడు బ్యాట్ పడితే ప్రత్యర్థి బౌలర్ఎంతటివాడైనా చేతులెత్తేయాల్సిందే. ఆ మాస్టర్‌ను చూసి ఎందరో యువ క్రికెటర్లు స్ఫూర్తి పొంది ఆటలోకి వచ్చారు. అలా వచ్చిన విరాట్ కోహ్లీ.. మాస్టర్ అడుగుల్లో నడుస్తూ భారత క్రికెట్‌ను ఉన్నత శిఖరాలకు చేరుస్తున్నాడు. అయితే ఎంతో మంది ఆటగాళ్లు క్రికెట్లోకి వచ్చినా.. సచిన్ ప్రస్థానమే వేరు. మచ్చ లేని ఆటగాడు.. మైదానంలో వాదులాడని స్వభావం కలవాడు. మరి అలాంటి క్రికెటర్ వెయిటర్ చెప్పిన సలహా పాటించాడు. అంతటి ప్రపంచ ప్లేయర్‌కు ఉన్న ఓ సమస్యను ఎవ్వరూ గుర్తించలేదని.. ఆ వెయిటర్ మాత్రమే గుర్తించినట్లు తాజాగా వెల్లడించాడు సచిన్.
సచిన్‌కు సలహా ఇచ్చిన ఆ వెయిటర్ ఎవరు..? - taj coromandel waiter sachin tendulkar
ప్రపంచ క్రికెట్‌ను పాతికేళ్లకు పైగా శాసించిన దిగ్గజం సచిన్ తెందూల్కర్. క్రికెట్లో అతడిని స్ఫూర్తిగా తీసుకుని వచ్చిన ఆటగాళ్లెందరో ఉన్నారు. మరి అలాంటి స్టార్ క్రికెటర్‌కు ఓ వెయిటర్ సలహా ఇచ్చాడు. దాన్ని పాటించిన సచిన్ మంచి ఫలితాలను పొందాడు. ప్రస్తుతం అతడి కోసం మాస్టర్ వెతుకుతున్నాడు. ఎక్కడైనా కనబడితే చెప్పాలని ట్విట్టర్ వేదికగా అభిమానులను కోరాడు.

ఓ టెస్టు మ్యాచ్ కోసం చెన్నై వెళ్లిన సచిన్.. అక్కడ తాజ్ కోరమాండల్ హోటల్లో బస చేశాడు. ఆ సమయంలో సచిన్ కాఫీ ఆర్డర్ ఇవ్వగా... ఓ వెయిటర్ దాన్ని తీసుకొచ్చి ఇచ్చాడు. కాఫీ ఇచ్చిన అనంతరం మాస్టర్‌తో కాసేపు మాట్లాడాలని అడిగాడట ఆ వెయిటర్. అందుకు ఒప్పుకున్న సచిన్.. విషయం చెప్పమని అడిగాడు. ఎల్బోగార్డ్ ఉపయోగించినప్పుడు బ్యాట్ స్వింగ్ మారుతుందని సచిన్‌కు చెప్పాడట ఆ వెయిటర్. తర్వాత ఆ విషయాన్ని గమనించిన సచిన్‌కు వెయిటర్ మాటలు నిజమని అర్థమైందట. తాాజాగా ఓ చిట్‌చాట్‌కు వచ్చిన ఈ దిగ్గజ క్రికెటర్ ఆ వెయిటర్ గురించి మాట్లాడాడు. ప్రపంచంలో తన తప్పును చెప్పిన ఏకైక వ్యక్తి అని అతడికి కితాబిచ్చాడు. అతడి సలహా పాటించి తన ఎల్బో ప్యాడ్‌ను మార్పు చేసుకున్నట్లు తెలిపాడు.
ఆ వెయిటర్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడో సచిన్‌కు తెలియదట. నెటిజన్లు దయచేసి అతడి గురించి వివరాలు తెలిస్తే చెప్పాలని ట్విట్టర్ వేదికగా కోరాడు. ఇంగ్లీష్‌తో పాటు తమిళంలోనూ తెందూల్కర్ ట్వీట్ చేయడం విశేషం.