తెలంగాణ

telangana

ETV Bharat / sports

బంగ్లాదేశ్​ క్రికెట్​ జట్టు​ మాజీ కెప్టెన్​కు కరోనా - బంగ్లాదేశ్​ క్రికెటర్లకు కరోనా

బంగ్లాదేశ్​ సీనియర్​ క్రికెటర్​​ ముషారఫే మోర్తజాకు కరోనా వైరస్ సోకినట్టు తేలింది. ఈ విషయాన్ని ఆ దేశానికి సంబంధించిన ఓ వార్తా పత్రిక నివేదించింది.

Mashrafe Mortaza tests positive for COVID-19
బంగ్లాదేశ్ క్రికెట్​ జట్టు​ మాజీ కెప్టెన్​కు కరోనా

By

Published : Jun 20, 2020, 6:42 PM IST

Updated : Jun 20, 2020, 10:01 PM IST

కరోనా వైరస్​ ఎవరినీ విడిచిపెట్టడం లేదు. సినీ తారలు, ఆటగాళ్లు, రాజకీయ ప్రముఖులు.. ఇలా అందర్నీ ముప్పతిప్పలు పెడుతోంది. తాజాగా బంగ్లాదేశ్​ క్రికెట్​ జట్టు మాజీ కెప్టెన్​ ముషారఫే మోర్తజాకు కరోనా సోకింది. ఈ విషయాన్ని బంగ్లాదేశ్​కు చెందిన ఓ వార్తాపత్రిక స్పష్టం చేసింది.

"గురువారం రాత్రి జ్వరం వచ్చిందని ముషారఫే మోర్తజా వైద్యులను సంప్రదించాడు. శుక్రవారం నాడు అతని రక్త నమూనాలు పరీక్షించగా.. కరోనా వైరస్ పాజిటివ్​ వచ్చింది. మోర్తజా ప్రస్తుతం ఇంటికే పరిమితమై చికిత్స చేయించుకుంటున్నాడు. అతని కుటుంబసభ్యులు ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు" అని ఆ నివేదిక వెల్లడించింది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాదేశ్​ కెప్టెన్​ పదవి నుంచి వైదొలిగాడు మోర్తజా. ఈ క్రమంలో అతను క్రికెట్​కు రిటైర్​మెంట్​ ప్రకటిస్తాడనే వార్తలు ప్రచారం అయ్యాయి. కానీ అలాంటిదేం జరగలేదు. అంతర్జాతీయ క్రికెట్​లో బంగ్లాదేశ్​ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ముషారఫే మోర్తజా.. 220 వన్డేల్లో 270 వికెట్లు, 36 టెస్టుల్లో 78 వికెట్లు, 54 టీ20ల్లో 42 వికెట్లను సాధించాడు.

ఇప్పటికే ఓ క్రికెటర్​కు కరోనా

బంగ్లాదేశ్ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ సోదరుడు, మాజీ క్రికెటర్​ నఫీజ్​కు కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఇతడు చిట్టగాంగ్​లోని తన ఇంట్లో స్వీయ నిర్బంధంలో ఉన్నాడని.. ఆ దేశానికి చెందిన ఓ వార్తాపత్రిక రాసుకొచ్చింది.

నఫీజ్ ఇక్బాల్

ఇదీ చూడండి... గిన్నీస్​ రికార్డుల్లో బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు

Last Updated : Jun 20, 2020, 10:01 PM IST

ABOUT THE AUTHOR

...view details