టీమిండియాతో రెండో టీ20లో పిచ్ నెమ్మదిగా స్పందించిన కారణంగానే తాము బ్యాటింగ్‌లో ఇబ్బంది పడ్డామని న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ అన్నాడు. భారత్ గెలిచేందుకు పిచ్ ప్రధాన కారణమని చెప్పాడు. కోహ్లీసేనతో పాటు పేసర్ బుమ్రాపై ప్రశంసలు కురిపించాడీ బ్యాట్స్‌మన్.
బుమ్రాపై కివీస్ ఓపెనర్ గప్తిల్ ప్రశంసలు - new zealand vs india 2020
టీమిండియా స్టార్ బౌలర్ బుమ్రాపై, కివీస్ ఓపెనర్ గప్తిల్ ప్రశంసలు కురిపించాడు. రెండో టీ20లో తమకు పరుగులే చేసే అవకాశం దొరక్కుండా చాలా చక్కగా బౌలింగ్ చేశాడని అన్నాడు.
"పిచ్ చాలా మందకొడిగా మారింది. ఆ కారణంగానే మేం బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పరుగులు తీసేందుకు చాలా ఇబ్బంది పడ్డాం. బ్యాటింగ్ చేయడం కష్టమైంది. మా టాప్ 4 బ్యాట్స్‌మెన్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేయాల్సింది. కానీ సరైన భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయారు. ఈ అవకాశాన్ని భారత బౌలర్లు బాగా సద్వినియోగం చేసుకున్నారు. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బుమ్రా దడపుట్టించాడు. ఆది నుంచి చివరి వరకూ బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి మమ్మల్ని నియంత్రించాడు. బుమ్రాపై ఎదురుదాడికి దిగడం చాలా కష్టమైంది" -మార్టిన్ గప్తిల్, కివీస్ ఓపెనర్
ఈ బుధవారం.. హామిల్డన్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య మూడో టీ20 జరగనుంది. ఇది గెలిస్తే సిరీస్ టీమిండియా వశమవుతుంది. అయితే ఈ మ్యాచ్ గెలిచి, రేసులో నిలవాలని భావిస్తోంది కివీస్.