ఐపీఎల్లో ఆడటం తనకెంతో ఇష్టమని ఆస్ట్రేలియా యువ బ్యాట్స్మన్ మార్నస్ లబుషేన్ చెప్పాడు. ఈ మెగాలీగ్లో పాల్గొనేందుకు చాలా కాలంగా ఆసక్తితో ఎదురు చూస్తున్నట్లు వెల్లడించాడు.
"ఐపీఎల్లో ఆడేందుకు చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నాను. ఈ లీగ్లో ఆడే అవకాశం వచ్చినప్పుడు పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాను. గతేడాది నుంచి నా కెరీర్ చాలా అభివృద్ధి చెందింది. నా ఆటతీరులో మార్పు వచ్చింది. ఇదంతా చాలా త్వరగా జరిగిపోయింది"
-లబుషేన్, ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్