తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆసీస్ క్రికెటర్ స్టోయినిస్​కు భారీ జరిమానా - Kane Richardson

బిగ్​బాష్​ లీగ్ సహచర ఆసీస్ ఆటగాడు కేన్ రిచర్డ్​సన్​ను వ్యక్తిగతంగా దూషించిన కారణంగా మార్కస్ స్టోయినిస్​కు భారీ జరిమానా విధించింది క్రికెట్ ఆస్ట్రేలియా. 7500 డాలర్ల ఫైన్ వేసింది.

Marcus Stoinis fined for abusing Kane Richardson
మార్కస్ స్టాయినీస్

By

Published : Jan 5, 2020, 10:53 AM IST

ఆస్ట్రేలియా క్రికెటర్ మార్కస్ స్టోయినిస్​కు భారీ జరిమానా పడింది. బిగ్ బాష్​ లీగ్​​లో సహచర ఆసీస్ ఆటగాడు కేన్ రిచర్డ్​సన్​ను వ్యక్తిగతంగా దూషించిన కారణంగా అతడికి 7500 డాలర్ల(రూ.5లక్షల 38వేలు) ఫైన్ విధించింది క్రికెట్ ఆస్ట్రేలియా.

మెల్​బోర్న్ స్టార్స్ - మెల్​బోర్న్ రెనిగేడ్స్ మధ్య జరిగిన మ్యాచ్​లో రెనిగేడ్స్ ఆటగాడు రిచర్డ్​సన్​ను రెచ్చగొట్టేలా దూషించాడు స్టోయినిస్. అనంతరం తన తప్పు ఒప్పుకుని చేసిన పనికి క్షమాపణ చెప్పాడు.

ఆ క్షణంలో అనుకోకుండా నోరు జారా. వెంటనే నేను చేసిన తప్పు తెలుసుకుని కేన్​కు, అంపైర్లకు క్షమాపణ కోరా. తప్పుకు ప్రతిఫలంగా ఏ శిక్ష వేసిన సమ్మతమే. విధించిన జరిమానాను అంగీకరిస్తున్నా - మార్కస్ స్టోయినిస్, ఆసీస్ క్రికెటర్

2018 బాల్​ ట్యాంపరింగ్ ఉదంతం అనంతరం ఆటగాళ్ల ప్రవర్తనపై ఓ కన్నేసింది క్రికెట్ ఆస్ట్రేలియా. రెచ్చగొట్టేలా మాట్లాడటం, దూషించడం లాంటివి చేస్తే కఠిన శిక్షలు విధిస్తుంది.

ఇదీ చదవండి: 'అందరికీ అరంగేట్రం.. నాకు మాత్రం ముగింపు'

ABOUT THE AUTHOR

...view details