తెలంగాణ

telangana

ETV Bharat / sports

'కోహ్లీ, ధోనీలు నా కొడుకును వెన్నుపోటు పొడిచారు'

తన కుమారుడు కెరీర్​ను నాశనం కావడానికి ధోనీ, కోహ్లీ, సెలక్టర్లు కారణమని చెప్పిన యువీ తండ్రి యోగ్​రాజ్ సింగ్.. వారందరూ అతడ్ని వెన్నుపోటు పొడిచారని తెలిపాడు.​

'కోహ్లీ, ధోనీలు నా కొడుకును వెన్నుపోటు పొడిచారు'
కోహ్లీ, ధోనీ

By

Published : May 6, 2020, 10:16 AM IST

తన కుమారుడు యువరాజ్​ కెరీర్​ పాడైపోవడానికి కోహ్లీ, ధోనీలే కారణమని సంచలన వ్యాఖ్యలు చేశాడు యోగ్​రాజ్​ సింగ్. కష్టకాలంలో అతడికి అండగా నిలవలేదని చెప్పాడు. ఓ జాతీయ మీడియా ఛానెల్​తో మాట్లాడుతూ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించాడు.

"యువరాజ్​ను ఎంతో మంది వెన్నుపోటు పొడిచారు. అందులో ప్రస్తుత- మాజీ కెప్టెన్లు కోహ్లీ, ధోనీ ఉన్నారు. ఇది చాలా బాధకల్గించే అంశం.సెలక్టర్లూ అతడి కెరీర్​ను నాశనం చేశారు. అందులో శరణ్​దీప్.. యువీని జట్టు నుంచి తప్పించాలని చూశాడు. క్రికెట్​లో ఓనమాలు తెలియని ఇలాంటి వారిని సెలక్షన్ కమిటీలో ఎలా చేర్చుకున్నారో తెలియదు" -యోగ్​రాజ్ సింగ్, యువరాజ్ తండ్రి

యువరాజ్ సింగ్​తో యోగ్​రాజ్ సింగ్

గతేడాది ఆటకు వీడ్కోలు పలికిన యువీ.. తనకు భారత కెప్టెన్లలో ధోనీ, కోహ్లీల కన్నా గంగూలీ నుంచే ఎక్కువ మద్దతు లభించిందని అన్నాడు. అంతకు ముందు యువీ కెరీర్​ విషయంలో ఎన్నోసార్లు ధోనీపై యోగ్​రాజ్ ఆరోపణలు చేశాడు. 2011లో తన కొడుకును కాదని రైనాను జట్టులోకి తీసుకోవాలని ప్రయత్నించాడని, యువరాజ్​ రాణిస్తే తమకు పేరు రాదనే ఉద్దేశంలో మహీ, కోహ్లీలు అతడి పట్ల వివక్ష చూపేవారని పేర్కొన్నాడు.

ABOUT THE AUTHOR

...view details