తెలంగాణ

telangana

ETV Bharat / sports

మాన్సి జోషికి కరోనా.. మహిళా టీ20 లీగ్​కు దూరం!

టీమ్​ఇండియా మాహిళా పేసర్ మాన్సి జోషి కరోనా బారిన పడింది. దీంతో ఆమె మహిళా టీ20 లీగ్​లో పాల్గొనడం సందేహంగా మారింది.

Mansi Joshi tests positive for coronavirus, to miss Women's T20 Challenge
మాన్సి జోషికి కరోనా

By

Published : Oct 17, 2020, 12:10 PM IST

Updated : Oct 17, 2020, 1:14 PM IST

భారత జట్టు మహిళా పేసర్ మాన్సి జోషి కరోనా బారిన పడింది. దీంతో ముంబయిలో ఉన్న మహిళా జట్టుతో కలవలేకపోయింది. ఈ విషయాన్ని బీసీసీఐ వెల్లడించింది. దీంతో మాన్సి మహిళా టీ20లో ఆడే అవకాశాన్ని కోల్పోయినట్లు సమాచారం.

మాన్సి జోషి

ఇటీవలే మూడు మహిళా జట్లతో టీ20 ఛాలెంజ్ లీగ్​ను నిర్వహించబోతున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ మూడు జట్లకు సారథులుగా హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, మిథాలీ రాజ్ వ్యవహిరంచనున్నారు. ఈ టోర్నీలో పాల్గొనేందుకు ఇప్పటికే అందరూ ముంబయి చేరుకుని క్వారంటైన్​లో ఉన్నారు.

ఈ లీగ్​లో మాన్సి.. మిథాలీ నాయకత్వం వహిస్తోన్న వెలాసిటీకి ప్రాతినిధ్యం వహిస్తోంది. అయితే ఇప్పుడు ఈమెకు కరోనా సోకడం వల్ల మాన్సి స్థానంలో మేఘనా సింగ్​ను తీసుకున్నట్లు సమాచారం.

Last Updated : Oct 17, 2020, 1:14 PM IST

ABOUT THE AUTHOR

...view details