తెలంగాణ

telangana

ETV Bharat / sports

'మన్కడింగ్​ విషయంలో అశ్విన్​ తప్పేమీ లేదు' - LORDS

మన్కడింగ్‌ వివాదంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఐపీఎల్ పంజాబ్‌ జట్టు సారథి రవిచంద్రన్‌ అశ్విన్‌కు.. ఎంసీసీ (మెరిల్​బోన్​ క్రికెట్ క్లబ్) మద్దతుగా నిలిచింది. ఈ క్లబ్​  క్రికెట్ నిబంధనలు రూపొందిస్తుంది.

మన్కడింగ్​పై అశ్విన్​కు మద్దతుగా నిలిచిన ఎంసీసీ

By

Published : Mar 27, 2019, 6:29 PM IST

రాజస్థాన్‌ రాయల్స్‌ , కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ జట్ల మధ్య జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో అశ్విన్‌.. రాజస్థాన్​ ఆటగాడు బట్లర్‌ను మన్కడింగ్‌ విధానంలో ఔట్‌ చేయడం వివాదాస్పదమైంది. అశ్విన్‌ క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించాడని అభిమానులు, మాజీ క్రికెటర్లు అతనిపై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఎంసీసీ ఆ నిబంధనలపై వివరణ ఇచ్చింది.

ఎంసీసీ వివరణపై ట్వీట్​

మన్కడింగ్​ విషయంలో అశ్విన్‌ ఏమాత్రం తప్పుచేయలేదని, అతడు నిబంధనల మేరకే నడుచుకున్నాడని స్పష్టం చేసింది ఎంసీసీ. మన్కడింగ్‌ "నిబంధన 41.16 "ఉండాల్సిన అవసరాన్ని నొక్కి వక్కాణిస్తూ ప్రకటన జారీ చేసింది.

నిబంధన 41.16 ఏం చెప్తోంది...?

" ఈ నిబంధన చాలా ముఖ్యమైంది. ఇదే లేకపోతే నాన్‌ స్ట్రైకర్ బ్యాట్స్​మెన్​ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారు. బౌలర్‌ బంతి వేయకుండానే పిచ్‌ సగం వరకు వెళ్లిపోతుంటారు. ఇలా జరగకుండా ఉండాలంటే ఈ నిబంధన కచ్చితంగా అవసరం. బౌలర్‌ బ్యాట్స్‌మన్‌ను హెచ్చరించాలనే విషయంలో నిబంధనేమీ లేదు. ఇది క్రీడాస్ఫూర్తికి వ్యతిరేకమూ కాదు. బౌలర్‌ బంతి వేయకుండానే నాన్‌స్ట్రైకర్‌ క్రీజు దాటితేనే రనౌట్‌ అవుతారు. ఒక వేళ అశ్విన్‌ కావాలనే బంతి ఆలస్యంగా వేసి ఔట్​ చేస్తే అది క్రీడా స్ఫూర్తికి విరుద్ధం. కానీ అశ్విన్‌ అలా చేయలేదని వివరణ ఇచ్చుకున్నాడు. మూడో అంపైర్‌ కూడా నిబంధనల ప్రకారమే ఔట్‌ ఇచ్చాడు. నాన్‌స్ట్రైకర్ బ్యాట్స్​మెన్ ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. బౌలర్లు కూడా నిబంధనలకు లోబడి నిర్దిష్ట సమయంలోనే బౌలింగ్‌ చేయాలి" అంటూ నిబంధన 41.16 పై వివరణ ఇచ్చింది మెరిల్​బోన్​ క్రికెట్ క్లబ్.

నిబంధనపై వివరణ ఇచ్చిన ఎంసీసీ

ABOUT THE AUTHOR

...view details