తెలంగాణ

telangana

ETV Bharat / sports

మన్కడింగ్​ను క్రియేటివ్​గా వాడిన పోలీసులు

వాహనదారులు ట్రాఫిక్​ నిబంధనలు పాటించేలా చైతన్య పరిచేందుకు కోల్​కతా పోలీసులు వినూత్న ప్రయోగం చేశారు. క్రీడల్లో చర్చనీయాంశమైన మన్కడింగ్​ ఫొటోను సందేశాత్మకంగా తీర్చిదిద్దారు.

మన్కడింగ్​ను క్రియేటివ్​గా వాడేసిన కోల్​కతా పోలీసులు

By

Published : Mar 27, 2019, 2:47 PM IST

ఐపీఎల్​లో అశ్విన్​ మన్కడింగ్​ వివాదంపై ఓ వైపు చర్చ జరుగుతుంటే... అదే అంశాన్ని కోల్​కతా పోలీసులు మాత్రం ట్రాఫిక్​ నిబంధనలపై అవగాహనకు ఉపయోగించుకున్నారు. బంతి వేయకుండానే నాన్​ స్ట్రైకర్​ ఎండ్​లో ఉన్న బట్లర్​ క్రీజు దాటగా.. అశ్విన్​ రనౌట్​ చేశాడు. ఈ ఆటగాడి వికెట్​ కోల్పోయినందున రాజస్థాన్​ రాయల్స్ గాడి తప్పింది.​ జట్టు ఓటమి పాలైంది.

కోల్​కతా పోలీసుల ట్వీట్​

మన్కడింగ్​ ఫొటోను.. ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద లైన్​ దాటిన ఓ వాహనం ఫొటోను పక్క పక్కన పెట్టి ట్వీట్​ చేశారు కోల్​కతా పోలీసులు. క్యాప్షన్​​గా ‘క్రీజ్, రోడ్డు ఒకటే.. లైన్‌ దాటితే మూల్యం చెల్లించుకోక తప్పదని’ పేర్కొన్నారు. వినూత్నంగా ఉన్నందున నెట్టింట వైరల్​గా మారింది.

జైపూర్​ పోలీసుల వినూత్నత

గతంలోనూ జైపూర్‌ పోలీసులు ఛాంపియన్స్​ ట్రోఫీలో బుమ్రా నోబాల్​ దృశ్యాన్ని... ఈ విధంగానే ప్రచారానికి వాడుకున్నారు. దీనిపై బుమ్రా స్పందించగా వివరణ సైతం ఇచ్చుకున్నారు.

బుమ్రా కామెంట్​
బుమ్రాకు వివరణ ఇచ్చుకున్న జైపూర్​ పోలీసులు

ABOUT THE AUTHOR

...view details