తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐసీసీ వన్డే, టీ20 జట్లలో స్మృతి మంధాన - ICC ODI Team

ఐసీసీ ప్రకటించిన వన్డే, టీ20.. రెండు జట్లలో భారత మహిళ క్రికెట్ జట్టు ఓపెనర్ స్మృతి మంధాన చోటు దక్కించుకుంది. ఆసీస్ ప్లేయర్లు అలీసా హేలీ టీ20, ఎలైస్ పెర్రీ వన్డే జట్ల.. క్రికెటర్ ఆఫ్ ద ఇయర్​గా నిలిచారు.

Mandhana in ICC's ODI and T20 team of the year
స్మృతి మంధాన

By

Published : Dec 17, 2019, 1:06 PM IST

ఐసీసీ మంగళవారం ఈ ఏడాది అత్యుత్తమ వన్డే, టీ20 జట్లు ప్రకటించింది. భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన రెండు జట్లలోనూ చోటు సాధించింది. రెండు ఫార్మాట్లలో కలిపి స్మృతి 3476 పరుగులు చేసింది. 51 వన్డేలు, 66 టీ20లు ఆడిందీ ఓపెనర్.

వన్డే జట్టులో భారత్​ నుంచి స్మృతితో పాటు జులన్ గోస్వామి, పూనమ్ యాదవ్, శిఖా పాండే చోటు దక్కించుకున్నారు. దీప్తి శర్మ టీ20 జట్టులో స్థానం సంపాదించింది. ఆసీస్ ప్లేయర్ మెగ్ లానింగ్ రెండు జట్లకూ కెప్టెన్​గా ఎంపికైంది.

ఆస్ట్రేలియా ప్లేయర్ అలిసా హేలీ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్​గా నిలిచింది. ఈ ఏడాది ప్రారంభంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్​లో 148 పరుగులు చేసి రికార్డు సృష్టించింది.

ఆసీస్​కే చెందిన ఎలైస్ పెర్రీ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్​ పురస్కారం గెల్చుకుంది. ఈ ఏడాది 73.50 సగటుతో 441 పరుగులు చేయడమే కాకుండా 21 వికెట్లు తీసింది పెర్రీ.

ఇదీ చదవండి: భారత్​తో వన్డే సిరీస్​కు ఆసీస్ జట్టు ప్రకటన

ABOUT THE AUTHOR

...view details