గతేడాది వార్షిక కాంట్రాక్ట్‌ల జాబితాను టీమిండియా ప్రకటించగానే అందరూ ఆశ్చర్యపోయారు. అందులో ధోనీ పేరు లేదేంటా అని చర్చించుకున్నారు. అతడు రిటైర్మెంట్ తీసుకునేందుకు సిద్ధమయ్యాడని భావించారు. అందుకు తగ్గట్లుగానే వన్డే ప్రపంచకప్ తర్వాత నుంచి మహీ, ఆటకు దూరంగా ఉండటం వల్ల ఈ వ్యాఖ్యలకు బలం చేకూరింది. తాజాగా ఇదే విషయమై మాట్లాడిన బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్.. క్రికెట్ నుంచి ధోనీ ఇష్టప్రకారమే తప్పుకున్నాడని, ఇది తనకు ముందే తెలుసని పేర్కొన్నాడు.
"ఈ విషయంపై చాలా స్పష్టంగా ఉన్నాను. అతడితో చర్చలు కూడా జరిపాం. కొంతకాలం పాటు క్రికెట్‌కు దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు ధోనీ నాతో చెప్పాడు. అందుకే అతడి స్థానంలో యువ వికెట్‌కీపర్ రిషభ్ పంత్‌కు అవకాశం కల్పించాం" -ఎమ్మెస్కే ప్రసాద్, సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్