మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆదివారం(మార్చి 28) నుంచి రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. త్వరలో ముంబయిలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లపై ఈ ప్రభావం ఉంటుందేమోనని సందేహాలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ అధికారి ఒకరు దీనిపై వివరణ ఇచ్చారు.
ఐపీఎల్లో పాల్గొనే క్రికెటర్లు, ఇతర సిబ్బంది బయో బబుల్ ఉంటారని, దీంతో వాళ్లకు ఈ నిబంధనల్లో మినహాయింపు ఉంటుందని అసీమ్ గుప్తా అన్నారు. మ్యాచ్‌ల నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, ప్రేక్షకులకు అనుమతి లేదు కాబట్టి షెడ్యూల్ ప్రకారం అవి జరుగుతాయని తెలిపారు.