మాస్టర్ బ్లాస్టర్ సచిన్. తన బ్యాటింగ్‌తో ఎన్నో రికార్డులు నెలకొల్పిన ఆటగాడు. వన్డేల్లో 18,426 పరుగులు, టెస్టుల్లో 15,921 పరుగులు సాధించాడు. రెండు ఫార్మాట్లలో అత్యధిక పరుగులు చేసిన ఘనత మాస్టర్‌కే దక్కుతుంది. టెస్టుల్లో 51, వన్డేల్లో 49 సెంచరీలు సాధించి అంతర్జాతీయ స్థాయిలో మొత్తం 100 శతకాలు చేసిన ఏకైక క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు.
అద్భుత బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందిన సచిన్.. కెప్టెన్సీ నైపుణ్యాల విషయంలో మాత్రం ఎన్నో ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వచ్చింది. టీమ్ఇండియాకు 73 వన్డేల్లో లిటిల్ మాస్టర్ సారథిగా వ్యవహరించగా.. అందులో 23 మాత్రమే గెలిచి, 43 మ్యాచ్‌లు ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇక టెస్టుల్లో 25 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా చేయగా .. నాలుగింటిలో మాత్రమే విజయం సాధించింది.
తాజాగా భారత మాజీ ఫాస్ట్ బౌలర్, కోచ్ మదన్ లాల్ ఫేస్బుక్ లైవ్ ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించారు. తెందూల్కర్ తన సొంత ప్రదర్శన పట్ల ఎక్కువ జాగ్రత్తలు తీసుకునేవాడని పేర్కొన్నారు. ఆ విధంగా చేయడం వల్ల జట్టును చూసుకోవడం కష్టమైందని తెలిపారు.