తెలంగాణ

telangana

By

Published : Apr 25, 2020, 1:49 PM IST

ETV Bharat / sports

'మేనేజ్​మెంట్ మద్దతు వల్లే జట్టులోకి వచ్చా'

క్రికెటర్లకు తరచూ గాయాలు అవుతూ ఉంటాయి. టీమ్​ఇండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ కూడా గాయం నుంచి కోలుకుని ఇటీవలే దక్షిణాప్రికా సిరీస్​కు ఎంపికయ్యాడు. అయితే మళ్లీ జట్టులోకి రావడానికి సహ ఆటగాళ్లతో పాటు మేనేజ్​మెంట్ మద్దతు లభించిందని తెలిపాడు.

భువీ
భువీ

క్రికెటర్లకు గాయాలు మామూలే. కానీ ఆ గాయాల నుంచి కోలుకుని మళ్లీ జట్టులోకి రావడమే కష్టం. టీమ్​ఇండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ కూడా ఇటీవల గాయం బారినపడ్డాడు. త్వరగానే కోలుకుని జట్టులోకి వచ్చాడు. ఈ విషయంపై స్పందిస్తూ.. సహ ఆటగాళ్లు, మేనేజ్​మెంట్ మద్దతు వల్లే మళ్లీ జట్టులోకి రాగలిగానని చెప్పాడు.

"మనకెప్పుడూ మేనేజ్​మెంట్ మద్దతు ఉండాలి. నాకు సహ ఆటగాళ్లు, యాజమాన్యం నుంచి మంచి మద్దతు లభించింది. ఒక బౌలర్​గా మూడు ఫార్మాట్లకు ఆడటం చాలా కష్టంతో కూడుకున్నది. అందులో గాయాలూ మనల్ని చాలా ఇబ్బందిపెడతాయి. అలాంటప్పుడు బౌలింగ్ లయ దెబ్బతింటుంది. అదే లయతో మళ్లీ పునరాగమనం చేయడమూ కష్టమే."

-భువనేశ్వర్ కుమార్, టీమ్​ఇండియా పేసర్

గాయం కారణంగా కొంతకాలం జట్టుకు దూరంగా ఉన్నాడు భువనేశ్వర్. సర్జరీ తర్వాత కోలుకుని స్వదేశంలో జరగాల్సిన దక్షిణాఫ్రికా సిరీస్​కు ఎంపికయ్యాడు. కానీ కరోనా కారణంగా ఆ సిరీస్ రద్దయింది.

ABOUT THE AUTHOR

...view details