క్రికెట్ మక్కాగా పిలిచే లార్డ్స్‌లో... సెంచరీ, ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు లేదా మ్యాచ్‌లో పది వికెట్ల ప్రదర్శన చేసిన వారి పేర్లను హానర్స్ బోర్డుపై రాస్తారు. ఇప్పటి వరకు 400 మందికి పైగా క్రికెటర్లు ఇలా హానర్స్ బోర్డు ఎక్కారు. అయితే దిగ్గజ క్రికెటర్లు కొందరికి మాత్రం ఆ కల నెరవేరలేదు. అందులో సచిన్ కూడా ఉన్నాడు.
టెస్టు కెరీర్లో 51 టెస్టు సెంచరీలు చేసిన మాస్టర్‌కు.. లార్డ్స్‌లో ఒక్క శతకం కూడా లేదు. ఇలా ప్రత్యేక ప్రదర్శన చేయలేకపోయిన దిగ్గజ ఆటగాళ్లతో.. లార్డ్స్ క్రికెట్ మైదానం 11 మంది సభ్యుల జట్టును రూపొందించింది. ఇందులో భారత్ నుంచి సచిన్ సెహ్వాగ్‌తో పాటు ప్రస్తుత టీమిండియా సారథి విరాట్ కోహ్లీ నిలిచాడు.