తెలంగాణ

telangana

ETV Bharat / sports

యాషెస్​: లార్డ్స్​లో ఎర్రటి టోపీలతో ఆటగాళ్లు - యాషెస్ టెస్టు

యాషెస్​లో భాగంగా లార్డ్స్ వేదికగా నేటి నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్​లో ఇంగ్లాండ్, ఆసీస్​ ఆటగాళ్లు ఎరుపు రంగు టోపీలు ధరించనున్నారు. ఊపిరితిత్తుల కేన్సర్​  బాధితులకు అండగా ఉంటోన్న రూత్ స్ట్రాస్ ఫౌండేషన్ కోసం విరాళాలు సేకరించేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

మ్యాచ్

By

Published : Aug 14, 2019, 7:46 AM IST

Updated : Sep 26, 2019, 10:49 PM IST

యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా జరగనున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్, ఆసీస్​ ఆటగాళ్లు ఎర్ర టోపీలు ధరించనున్నారు. ఊపిరితిత్తుల కేన్సర్​​ బాధితుల కోసం విరాళాలు సేకరించేందుకు రూత్​ స్ట్రాస్​ ఫౌండేషన్​తో కలిసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మ్యాచ్‌ వీక్షించేందుకు వచ్చిన ప్రేక్షకులూ ఎరుపు రంగు దుస్తుల్లో రావాల్సిందిగా లార్డ్స్ మైదానం నిర్వాహకులు కోరారు.

యాషెస్

ఎవరీ రూత్​..?

డిసెంబర్ 2018లో ఊపిరితిత్తుల కేన్సర్‌తో ఆండ్రూ స్ట్రాస్ భార్య రూత్ మరణించింది. ఆమె జ్ఞాపకార్థం ఈ ఫౌండేషన్​ స్థాపించారు. బుధవారం నుంచి ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ ద్వారా వచ్చిన డబ్బులను లంగ్ కేన్సర్ బాధితుల వైద్యం కోసం ఫౌండేషన్‌కు విరాళంగా ఇవ్వనున్నారు. మ్యాచ్ చూసేందుకు వచ్చిన వారికి ఈ మహమ్మారిపై అవగాహన కల్పించనున్నారు.

యాషెస్

భారత్​ కూడా గతంలో..

ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమిండియా .. ఆసీస్​ దిగ్గజం గ్లెన్ మెక్​గ్రాత్ ఫౌండేషన్ కోసం విరాళాలు సేకరించేందుకు పింక్ టోపీలను ధరించింది. ప్రపంచకప్​లోనూ 'వన్డే ఫర్​ చిల్డ్రన్​'​ పేరిట విరాళాల సేకరణకు సహకరించింది.

ఇవీ చూడండి.. భారత్​ పర్యటనకు వచ్చే సఫారీ జట్టిదే

Last Updated : Sep 26, 2019, 10:49 PM IST

ABOUT THE AUTHOR

...view details