చెన్నై సూపర్‌కింగ్స్ స్టార్ క్రికెటర్ సురేశ్ రైనా.. తమ జట్టు కొత్త జెర్సీ వేసుకునేందుకు ఆత్రుతగా ఉన్నాడు. ఈ విషయాన్నే ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు.
కొత్త జెర్సీపై రైనా ట్వీట్.. ధోనీపై ప్రశంసలు - chennai super kings raina
సీఎస్కే కొత్త జెర్సీ గురించి రైనా ట్వీట్ చేశాడు. దానిని త్వరగా వేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నట్లు చెప్పాడు. ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభమవుతుంది.
కొత్త జెర్సీపై రైనా ట్వీట్.. ధోనీపై ప్రశంసలు
"మన దేశానికి ఎంతో సేవ చేస్తున్న ఆర్మీ జవాన్ల గౌరవార్థం జెర్సీలో మార్పులు చేసినందుకు చెన్నై సూపర్‌కింగ్స్, ధోనీకి అభినందనలు. దానిని ధరించేందుకు చాలా ఆత్రుతగా ఉన్నాను" అని రైనా ట్వీట్ చేశాడు.
ట్రైనింగ్ క్యాంప్ కోసం ముంబయికి చేరుకున్న రైనా.. త్వరలో జట్టుతో కలవనున్నాడు. చెన్నై జట్టు తన తొలి మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. వాంఖడే స్టేడియం వేదికగా ఏప్రిల్ 10న ఈ పోరు జరగనుంది.