ఈ ఏడాది బిగ్‌బాష్ లీగ్ తేదీలను ఖరారు చేసింది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు. ఈ మేరకు బుధవారం సమ్మర్ బీబీఎల్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. డిసెంబర్ 3 నుంచి పురుషుల టోర్నీ ప్రారంభం కానుంది. దాదాపు రెండు నెలలకు పైగా ఈ మెగాటోర్నీ నిర్వహించనున్నారు. తొలి మ్యాచ్ అడిలైడ్ వేదికగా అడిలైడ్ స్ట్రైకర్స్, మెల్బోర్న్ రెనిగేడ్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ జరిగే రోజే ఆస్ట్రేలియా-భారత్ మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.
ఏడాది చివర్లో బిగ్‌బాష్ లీగ్.. షెడ్యూల్ ప్రకటన - Women's Big Bash League
బిగ్‌బాష్ లీగ్ మ్యాచ్ తేదీలను విడుదల చేసింది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు. బీబీఎల్ 10వ సీజన్ సహా మహిళల బిగ్‌బాష్ టోర్నీ 6వ సీజన్ షెడ్యూల్‌ను ప్రకటించింది.
ఖరారు
మహిళల బిగ్‌బాష్ 6వ సీజన్ అక్టోబర్ నుంచి మొదలుకానుంది. తొలి మ్యాచ్ అక్టోబర్ 17న బ్రిస్బేన్ వేదికగా జరగనుంది. ఇందులో మెల్బోర్న్ రెనిగేడ్స్, సిడ్నీ సిక్సర్స్ పోటీపడనున్నాయి. నవంబర్ 29న ఫైనల్ జరుగుతుంది. కరోనా నేపథ్యంలో సిడ్నీలోనే మ్యాచ్‌లన్నీ జరగనున్నాయి.