తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీ20: 12 హ్యాట్రిక్స్​లో.. ఆరు ఈ ఏడాదే... - హ్యాట్రిక్ వీరులు

అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఇప్పటివరకు 12 మంది హ్యాట్రిక్ వికెట్లు తీయగా.. ఒక్క ఈ ఏడాదే ఆరుగురు ఈ ఘనత సాధించారు. దీపక్ చాహర్, మలింగ, రషీద్ ఖాన్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.

హ్యాట్రిక్ వీరులు

By

Published : Nov 13, 2019, 4:01 PM IST

టీ20 క్రికెట్.. బ్యాట్స్​మన్ గేమ్​ అని.. బౌలర్లు అంతగా రాణించలేరని చాలామంది వాదన. కానీ ఈ పొట్టి ఫార్మాట్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకోవడమే కాదు హ్యాట్రిక్ వికెట్లతో దూసుకెళ్తున్నారు బౌలర్లు. ఒక్క ఈ ఏడాదే ఆరుగురు క్రికెటర్లు హ్యాట్రిక్ వికెట్లు తీసి రికార్డు సృష్టించారు.

దీపక్ చాహర్..

ఇటీవల బంగ్లాదేశ్​తో జరిగిన మూడో వన్డేలో హ్యాట్రిక్ వికెట్లతో అదరగొట్టాడు దీపక్ చాహర్. మొత్తం ఆరు వికెట్లు ఖాతాలో వేసుకుని టీ20ల్లో అత్యుత్తమ గణాంకాలు(6/7) నమోదు చేశాడీ టీమిండియా యువ బౌలర్.అంతర్జాతీయ టీ20లో హ్యాట్రిక్ తీసిన రెండో భారత క్రికెటర్​గానూ రికార్డు సృష్టించాడు.మంగళవారం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ హ్యాట్రిక్ వికెట్లు తీశాడు.

దీపక్ చాహర్

లసిత్ మలింగ..

టీ20ల్లో ఒకటి కంటే ఎక్కువ సార్లు హ్యాట్రిక్ తీసిన ఘనత సాధించాడు శ్రీలంక స్టార్ పేసర్ లసిత్ మలింగ. ఈ ఏడాది సెప్టంబరులో న్యూజిలాండ్​తో జరిగిన మ్యాచ్​లో ఈ రికార్డు అందుకున్నాడు. అంతకుముందు 2017లో బంగ్లాదేశ్​తో జరిగిన మ్యాచ్​లో పొట్టి ఫార్మాట్​లో తొలిసారి హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. మొత్తంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో(వన్డే, టీ20లు కలిపి) 5 సార్లు ఈ ఘనత సాధించాడు.

మలింగ

రషీద్ ఖాన్​..

ఫిబ్రవరిలో ఐర్లాండ్​తో జరిగిన మ్యాచ్​లో రషీద్ ఖాన్ అంతర్జాతీయ టీ20ల్లో తొలిసారి హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. మొత్తంగా ఆ మ్యాచ్​లో 27 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడీ అఫ్గాన్ స్టార్. అంతేకాదు ఈ ఘనత సాధించిన తొలి స్పిన్నర్​గానూ​ రికార్డు సృష్టించాడు.

రషీద్ ఖాన్​

మహ్మద్ హస్నన్..

పాకిస్థాన్ ఫాస్ట్​ బౌలర్ మహ్మద్ హస్నన్.. టీ20 క్రికెట్లో హ్యాట్రిక్ వికెట్లు తీసిన అతి పిన్నవయస్కుడిగా రికార్డు సృష్టించాడు. 19ఏళ్లకే ఈ ఘనత సాధించడం విశేషం. అక్టోబరులో శ్రీలంకతో జరిగిన మ్యాచ్​లో వరుసగా మూడు వికెట్లు తీశాడు. అయితే ఆ మ్యాచ్​లో పాక్ ఓడిపోవడం గమనార్హం.

మహ్మద్ హస్నన్

ఖావర్ అలీ..

ఒమన్​కు చెందిన ఖావర్ అలీ నెదర్లాండ్స్​పై హ్యాట్రిక్ వికెట్లు తీసి గుర్తింపు తెచ్చుకున్నాడు. అక్టోబరు 9న జరిగిన ఈ మ్యాచ్​లో 3.3 ఓవర్లు బౌలింగ్ చేసి 16 పరుగులిచ్చి 4 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడీ ఆటగాడు.

ఖావర్ అలీ

నొర్మాన్ వనూవా..

పపువా న్యూగినియాకు చెందిన నొర్మాన్.. బెర్ముడాపై హ్యాట్రిక్ వికెట్ల రికార్డు అందుకున్నాడు. అక్టోబరు 19న జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్స్ మ్యాచ్​లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్​లో 2.2 ఓవర్లు బౌలింగ్ చేసి 14 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు నొర్మాన్.

నొర్మాన్

ఇప్పటివరకు 12 మంది బౌలర్లు అంతర్జాతీయ టీ20 క్రికెట్లో హ్యాట్రిక్ వికెట్లు తీయగా.. ఈ ఏడాదే ఆరుగురు ఈ ఘనత సాధించడం విశేషం. మొదటి సారిగా 2007లో ఆస్ట్రేలియా బౌలర్ బ్రెట్​లీ బంగ్లాదేశ్​పై హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టాడు.

ఇదీ చదవండి: 'పింక్'​పై ఫోకస్ ఎక్కువ పెట్టాలి: కోహ్లీ

ABOUT THE AUTHOR

...view details