ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ మంగళవారం సంచలన నిర్ణయాన్ని ప్రకటించాడు. బార్సిలోనా క్లబ్‌తో తన ఒప్పందాన్ని ముగిస్తున్నట్లు స్పష్టం చేశాడు. తన కెరీర్ ప్రారంభం నుంచి ఈ క్లబ్‌లోనే గడిపిన మెస్సీ.. అంతర్గత గందరగోళాల కారణంగా బార్సిలోనాను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది. అయితే ఇతడి కోసం ఇప్పటికే పలు జట్లు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఈ విషయంపై ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆసక్తికర ట్వీట్ చేసింది. ఐపీఎల్ 13వ సీజన్లో మెస్సీ కేకేఆర్ జెర్సీ ధరించాలనుకుంటున్నారా? అని పోస్ట్ చేసింది.
ఐపీఎల్లో మెస్సీ.. ఫ్రాంచైజీల క్లారిటీ! - Lionel Messi
బార్సిలోనా ఫుట్‌బాల్ క్లబ్‌తో స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ తన ఒప్పందాన్ని ముగిస్తున్నట్లు మంగళవారం ప్రకటించాడు. ఆ తర్వాత పలు క్లబ్‌ల్లో మెస్సీ చేరుతాడనే ఊహాగానాలు వచ్చాయి. దీనిపై ఐపీఎల్ ఫ్రాంఛైజీలు కోల్‌కతా, దిల్లీ క్యాపిటల్స్ జట్లు ఆసక్తికర ట్వీట్లు చేశాయి.
బార్సిలోనాకు వీడ్కోలు పలికిన తర్వాత మెస్సీ ఏ క్లబ్లో చేరతాడనే ప్రశ్నకు.. కేకేఆర్.. "మిస్టర్ మెస్సీ.. మా జెర్సీని ధరించడానికి మీరేమంటారు? " అంటూ పోస్ట్ చేసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో పాటు దిల్లీ క్యాపిటల్స్, కేరళ బ్లాస్టర్స్ జట్లు కూడా మెస్సీ గురించి ట్వీట్లు చేశాయి. ఇటీవల వస్తున్న పుకార్ల నేపథ్యంలో లియోనల్ మెస్సీని తాము వేలంలో కొనలేదని దిల్లీ క్యాపిటల్స్ ధ్రువీకరించింది.
మాంచెస్టర్ సిటీ, పారిస్ సెయింట్-జర్మైన్, ఇంటర్ మిలాన్ క్లబ్‌లతో మెస్సీ సత్సంబంధాలు కలిగి ఉన్నాడు. ఆటగాళ్లకు ఇచ్చే జీతాల్లోనూ ఈ జట్లు ముందున్నాయి. అందువల్ల వీటిలో ఒక జట్టు మెస్సీని చేజిక్కించుకుంటుందని తెలుస్తోంది.