తెలంగాణ

telangana

ETV Bharat / sports

'వారిపై తొలి బంతి నుంచే ఒత్తిడి పెంచుతాం' - కోహ్లీ-విలియమ్సన్

న్యూజిలాండ్​ పర్యటనలో, ఆతిథ్య జట్టుపై తొలి బంతి నుంచే ఒత్తిడి పెంచుతామని అన్నాడు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఈనెల 24న ఇరుజట్ల మధ్య తొలి టీ20 జరగనుంది.

'వారిపై తొలి బంతి నుంచే ఒత్తిడి పెంచుతాం'
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ

By

Published : Jan 20, 2020, 3:29 PM IST

బలమైన ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్​ గెలిచి, న్యూజిలాండ్ పర్యటనకు సిద్ధమవుతోంది టీమిండియా. అయితే వారిపై తొలి మ్యాచ్​లోని మొదటి బంతి నుంచే ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తామని అంటున్నాడు భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ. పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నామని చెప్పాడు.

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ

"గతేడాది కివీస్ పర్యటనతో చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. అదే ఉత్సాహంతో బరిలోకి దిగుతున్నాం. వారి సొంతగడ్డపై వారినే ఒత్తిడిలోకి తోసి, క్రికెట్ ఆడితే ఆ మజానే వేరు. దానితో పాటే తొలి బంతి నుంచే ఆధిపత్యం చూపించాలనుకుంటున్నాం" -విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్

ఈ పర్యటనలో భాగంగా భారత్-న్యూజిలాండ్​ మధ్య 5 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టులు జరగనున్నాయి. ఈరోజు(సోమవారం) రాత్రే ఆ దేశానికి ప్రయాణం కానుంది కోహ్లీసేన.

భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ-కివీస్ సారథి విలియమ్సన్

ABOUT THE AUTHOR

...view details