ఐపీఎల్ సీజన్ వస్తుందంటే చాలు.. ఈ ప్రతిష్ఠాత్మక లీగ్‌లో ఆడే అవకాశం దక్కించుకున్న కుర్రాళ్లలో సత్తా చాటేదెవరనే ఊహాగానాలు మొదలవుతాయి. తొలిసారి లీగ్‌లో ఆడబోతున్న యువ క్రికెటర్లు ఏ మేరకు రాణించగలరనే సందేహాలు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ స్థాయి లీగ్‌లో మెరిసి.. టీమ్‌ఇండియా దిశగా సాగాలనే ఆశలు ఓ వైపు! అంచనాలను అందుకోవాలనే ఒత్తిడి మరోవైపు! మరి ఈ సారి ఆ ఒత్తిడిని చిత్తుచేసి మంచి ప్రదర్శనతో వెలుగులోకి రావాలని ఆరాటపడుతున్న ఆ కుర్రాళ్లు ఎవరు? వాళ్ల నేపథ్యం ఏమిటీ చూసేద్దాం పదండి.
సిక్సర్ల ఖాన్..
ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో తమిళనాడుకు చెందిన 25 ఏళ్ల ఆల్‌రౌండర్ షారుక్ ఖాన్ కోసం ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. అతని కోసం చివరకు పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ.5.25 కోట్లు చెల్లించడం ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఈ ఏడాది సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ అత్యధిక పరుగుల ఆటగాళ్ల జాబితాలో అతనేమీ ముందు వరుసలో లేడు. వికెట్ల వీరుల్లోనూ అతని పేరు లేదు. మరి అతని కోసం ఫ్రాంఛైజీలు ఎందుకు పోటీపడ్డాయంటే.. ఇన్నింగ్స్ చివరి ఓవర్లలో అలవోకగా సిక్సర్లు బాదగల నైపుణ్యం అతని సొంతం. దానికి తోడు ఉపయుక్తమైన ఆఫ్‌స్పిన్నర్ కూడా. ముస్తాక్ అలీ టోర్నీలో తన జట్టు విజయంలో అతనిది కీలక పాత్ర. క్వార్టర్స్‌లో కేవలం 19 బంతుల్లోనే 40 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. ఫైనల్లోనూ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ధనాధన్ బ్యాటింగ్‌కు తోడు రెండో మూడో ఓవర్లు వేసి ప్రత్యర్థిని కట్టడి చేయడం లాంటి నైపుణ్యాలతో తొలిసారి ఐపీఎల్‌లో సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. మిడిలార్డర్ వైఫల్యంతో ఇన్నింగ్స్ చివర్లో వేగంగా ఆడే ఆటగాడు లేక గత సీజన్‌లో వెనకబడ్డ పంజాబ్ కింగ్స్‌కు ఈ సారి షారుక్ కీలకం కానున్నాడు.
ఇదీ చదవండి:ఒలింపిక్స్‌కు భారత్ నుంచి 15 మంది షూటర్లు
ఆ కలకు దగ్గరగా..
కేరళ యువ వికెట్‌కీపర్, బ్యాట్స్‌మన్ మహమ్మద్ అజహరుద్దీన్ ఇంట్లోని ఓ గోడపై వరుసగా.. ఐపీఎల్, ఒక రంజీ సీజన్‌లో నాలుగు శతకాలు, సొంత ఇళ్లు, బెంజ్ కారు, 2023 ప్రపంచకప్ అని రాసి ఉంటుంది. ఇవన్నీ అతని కలలు. అందులో మొదటిదైన ఐపీఎల్‌లో ఆడాలనే లక్ష్యానికి అడుగు దూరంలో నిలిచాడు. వేలంలో కనీస ధర రూ.20 లక్షలకే అతణ్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు సొంతం చేసుకుంది. తక్కువ ధరకే అమ్ముడుపోయాడని అతని నైపుణ్యాలను తక్కువ చేసి చూడాల్సిన అవసరమే లేదు. ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబయి లాంటి అగ్రశ్రేణి జట్టుపై.. అదీ ఛేదనలో అతనాడిన 137 పరుగుల సంచలన ఇన్నింగ్సే అందుకు కారణం. ఓ టీ20 మ్యాచ్‌లో ఛేదనలో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా రికార్డు సొంతం చేసుకున్న అతని పేరు మార్మోగింది. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసే సామర్థ్యంతో పాటు వికెట్‌కీపింగ్‌లో చురుకుదనంతో ఆకట్టుకుంటున్నాడు. అగ్రశ్రేణి ఆటగాళ్లున్న ఆర్సీబీలో కనీసం ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం వచ్చినా రాణించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ 27 ఏళ్ల బ్యాట్స్‌మన్.. ఇప్పటివరకూ 24 టీ20 మ్యాచ్‌ల్లో 142.27 స్ట్రైక్‌రేట్‌తో 451 పరుగులు చేయడం విశేషం.
వారసుడొస్తున్నాడు..