తెలంగాణ

telangana

ETV Bharat / sports

ముందు దేశం.. తర్వాత ఐపీఎల్: రోహిత్ - Rohit sharma about corona

కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో టీమిండియా క్రికెటర్లు వారి కుటుంబాలతో సరదాగా గడుపుతున్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ అభిమానులతో టచ్​లో ఉంటున్నారు. తాజాగా రోహిత్ శర్మ తన ఇన్​స్టాలో ఫ్యాన్స్​తో ముచ్చటించాడు.

రోహిత్
రోహిత్

By

Published : Mar 27, 2020, 10:11 AM IST

కరోనా ప్రభావంతో ప్రస్తుతం టీమిండియా క్రికెటర్లు ఇంటివద్దే సరదాగా గడుపుతున్నారు. ఈ క్రమంలో ఓపెనర్ రోహిత్ శర్మ ఇన్​స్టాగ్రామ్​లో సరదాగా అభిమానులతో ముచ్చటించాడు. ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. ఐపీఎల్​పైనా స్పందించాడు. అలాగే ప్రస్తుత పరిస్థితులపైనా మాట్లాడాడు.

"మనం ప్రస్తుతం దేశం గురించి ఆలోచిద్దాం. ఇప్పుడున్న పరిస్థితులు చక్కదిద్దుకున్నాక ఐపీఎల్ గురించి మాట్లాడదాం. మన లైఫ్ నార్మల్ కానివ్వండి. ఇంతకుముందెప్పుడు ముంబయిని ఇలా చూడలేదు. క్రికెటర్లుగా మాకెప్పుడూ కుటుంబంతో గడిపే సమయం రాదు. ఎప్పుడూ పర్యటనలతో బిజీగా ఉంటాం. కానీ ఇప్పుడు వారితో సమయాన్ని పంచుకునే అవకాశం వచ్చింది."

-రోహిత్ శర్మ, టీమిండియా ఓపెనర్

ప్రస్తుతం పరిమిత ఓవర్లలో టీమిండియాకు వైస్ కెప్టెన్​గా ఉన్న రోహిత్.. ఐపీఎల్​లో ముంబయి ఇండియన్స్​కు సారథ్యం వహిస్తున్నాడు. ఇటీవల స్వదేశంలో జరగాల్సిన దక్షిణాఫ్రికా సిరీస్​లో హిట్​మ్యాన్​కు విశ్రాంతి ఇచ్చారు సెలక్టర్లు. కానీ ఆ సిరీస్ కరోనా కారణంగా రద్దయింది.

రోహిత్, రితిక

ABOUT THE AUTHOR

...view details