ఫస్ట్‌క్లాస్ దిగ్గజ స్పిన్నర్ రాజిందర్ గోయల్ (77) ఆదివారం తుదిశ్వాస విడిచారు. వయసు సంబంధిత అనారోగ్య సమస్యలతో మరణించారు. దేశవాళీలో మ్యాచ్ రిఫరీగానూ పనిచేసిన ఆయనకు భార్య, ఓ కొడుకు ఉన్నారు. ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ 157 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 750 వికెట్లు తీశారు. ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో ఎక్కువ వికెట్లు(637) తీసిన ఘనత ఈయనకే సొంతం. హరియాణా, నార్త్ జోన్ తరపున ప్రాతినిథ్యం వహించారు. మంచి స్పిన్నర్‌గా పేరు తెచ్చుకున్నప్పటికీ స్పిన్ దిగ్గజం బిషన్ సింగ్ బేడీ తరం ఆటగాడు కావడం వల్ల భారత జట్టులో గోయల్‌కు ఆడే అవకాశమే దక్కలేదు. బిషన్ సింగ్ చేతుల మీదుగా ఆయన బీసీసీఐ సీకే నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారం అందుకున్నారు. భారత దిగ్గజం సునీల్ గావస్కర్ తన పుస్తకం 'ఐడల్స్'లో 'నవ్వుతూనే చంపేవాడు' అని గోయల్ గురించి ప్రస్తావించారు.
స్పిన్ దిగ్గజం రాజిందర్ గోయల్ మృతి - స్పిన్ దిగ్గజం రాజిందర్ గోయల్ వార్తలు
భారత తరఫున ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో అత్యధిక వికెట్లు తీసి గుర్తింపు తెచ్చుకున్న రాజిందర్ గోయల్.. అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు.
స్పిన్ దిగ్గజం రాజిందర్ గోయల్
1974-75లో వెస్టిండీస్‌తో సిరీస్‌కు ఎంపిక కావడం వల్ల గోయల్ కొత్త బూట్లు, కిట్ కొనుక్కున్నాడని... కానీ తొలి టెస్టులో 12వ ఆటగాడిగా ఆడాడని, తర్వాత టెస్టులో బిషన్‌సింగ్ బేడీ జట్టులోకి రావడం వల్ల ఈ స్పిన్నర్ భారత్‌కు ఆడే అవకాశాన్ని కోల్పోయాడని సన్నీ గుర్తు చేసుకున్నాడు.
ఇవీ చదవండి: