భారత మాజీ క్రికెటర్లు సచిన్ తెందూల్కర్, వినోద్ కాంబ్లీ... వారి గురువు రమాకాంత్ ఆచ్రేకర్‌ను మరోసారి గుర్తుచేసుకున్నారు. గురువారం ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా వీరిద్దరూ నివాళులర్పించారు. గురువుతో తమకున్న అనుబంధాన్ని అభిమానులతో పంచుకున్నారు.
"ఆచ్రేకర్ సార్. మీరు ఎప్పటికీ మా గుండెల్లో నిలిచే ఉంటారు" అని ఆయనతోగతంలో దిగిన ఓ ఫోటోను ట్విటర్‌లో పోస్టు చేశాడు మాస్టర్.
ఎవ్వర్నీ నమ్మలేదు
మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ భావోద్వేగంతో ట్వీట్ చేశాడు. " మిమ్మల్ని నమ్మినంతగా ఇంకెవర్నీ నమ్మలేదు. ఎందుకుంటే మీరు క్రికెట్ ఎలా ఆడాలో చెప్పడమే కాదు.. జీవిత పాఠాలను నేర్పించారు. మిమ్మల్ని ఎంతగానో మిస్ అవుతున్నా ఆచ్రేకర్ సార్" అని రాసుకొచ్చాడు.
తెందూల్కర్‌కు తన గురువు ఆచ్రేకర్‌తో సన్నిహిత సంబంధాలుండేవి. క్రికెట్‌లో ఓనమాలు ఆయనే నేర్పించారంటూ గతంలో పలు వేదికలపై సచిన్ గుర్తు చేసుకున్నాడు. క్రికెట్ నుంచి రిటైరయిన తర్వాత ఆయన్ను తరచూ కలుస్తుండేవాడు. అనారోగ్యం కారణంగా గత ఏడాది జనవరి 2న ఆచ్రేకర్ తుదిశ్వాస విడిచారు. సచిన్‌కు మాత్రమే కాకుండా వినోద్ కాంబ్లే, ప్రవీణ్ ఆమ్రే లాంటి ప్రముఖ క్రికెటర్లకు ఆచ్రేకర్ మెంటార్‌గా ఉన్నారు. ఆచ్రేకర్ సేవలకు గుర్తుగా ఆయనకు భారత ప్రభుత్వం ద్రోణాచార్య అవార్డు, 2010లో పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది.